సినిమాకి వినసొంపుగా ఉండేది సంగీతమే. మంచి సంగీతం సినిమా స్థాయిని పెంచుతుంది. మంచి నేపథ్య సంగీతం గొప్ప అనుభూతిని ఇస్తోంది. అందుకే, సినీ లోకంలో విషయం ఉన్న సంగీత దర్శకుడికి గొప్ప విలువ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి విలువ ఉన్న సంగీత దర్శకుల్లో.. ముందుగా చెప్పుకునేది కీరవాణి, దేవిశ్రీప్రసాద్ ల గురించే. అయితే వీరిద్దరి పై ఎప్పటి నుండో ఒక విమర్శ ఒకటి చాల బలంగా వినిపిస్తోంది.
కీరవాణి.. రాజమౌళి సినిమాలకు, దేవిశ్రీ ప్రసాద్.. సుకుమార్ సినిమాలకు మాత్రమే తమ బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నారని.. మిగతా దర్శకులతో వీళ్ళ నుండి హిట్ మ్యూజిక్ రాదు అని.. ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ విమర్శకు తగ్గట్టుగానే అందులో నిజం ఉంది. వీరు మిగితా సినిమాలకు పనిచేసినప్పుడు ఏవరేజ్ మ్యాజిక్ మాత్రమే వచ్చింది. అందుకే, కీరవాణి, డీఎస్పీకి ఇటీవల బయట సినిమాల నుండి పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు.
కానీ ‘ఉప్పెన’ సినిమాతో దేవి పై ఉన్న ఆ అనుమానం మొత్తానికి పోయింది. ఉప్పెన సక్సెస్ లో డీఎస్పీ మ్యూజిక్ దే ప్రధాన పాత్ర. పైగా దేవిశ్రీ ప్రసాద్ నుండి ఈ మధ్య కాలంలో మ్యూజిక్ మేజిక్ అంటే ‘ఉప్పెన’నే. అందుకే మళ్ళీ దేవికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం దర్శకనిర్మాతలు, దేవి కోసం లైన్లోకి వస్తున్నారు. తాజాగా దేవి, రామ్ పోతినేని కొత్త చిత్రం కోసం పని చేయడానికి అంగీకరించాడు.
చాలా గ్యాప్ తర్వాత రామ్ హీరోగా నటించే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతుండటం విశేషం. దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తీస్తున్న కొత్త సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి ఖారారు అయ్యారు. అన్నట్టు గతంలో రామ్ నటించిన జగడం, రెడీ, నేను శైలజ వంటి సినిమాలకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్. రామ్ తో దేవి పని చేసిన సినిమాలన్నీ మ్యూజిక్ పరంగా మంచి హిట్ అయ్యాయి.