స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మూవీ పుష్ప. బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతోందీ చిత్రం. అనౌన్స్ నుంచీ హై బజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి లీకైంది. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఈ మూవీ టీజర్ ఎలా ఉండబోతోందో తేలిపోయింది.
సుకుమార్ – బన్నీ కాంబోలో రాబోతున్న మూడో చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సెట్‌చేసింది.
ఇప్పటికే వదిలిన ఫస్ట్ లుక్, చిత్రాల్లో బన్నీ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో.. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ ఎలా కనిపించనున్నాడో అనే క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే.. కొందరు మాత్రం గ్లింప్స్ అని అంటున్నారు. మెజారిటీ మాత్రం టీజరే రాబోతోందని అంటున్నారు.
సుక్కూ రిలీజ్ చేయబోయే ఆ వీడియోను కేజీఎఫ్-2 టీజర్ తరహాలో కట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో డైలాగులు ఏవీ ఉండవని సమాచారం. కేవలం హీరో ఎలివేషన్ హైలెట్ గా ఉండేలా చూస్తున్నాడట దర్శకుడు. ఇక, ఈ వీడియోకు డీఎస్పీ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోతుందని అంటున్నారు. మరి, దాని రేంజ్ ఏంటన్నది చూడాలి.