Puri jagannadh – Chiranjeevi: పూరి చెప్పిన ఆ కథని చిరంజీవి ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

ఇక ఈయన ఎన్టీఆర్ తో చేసిన ఆంధ్రావాలా సినిమా చిరంజీవి చేయాల్సింది. కానీ చిరంజీవి( Chiranjeevi ) రిజెక్ట్ చేయడం వల్ల అది ఎన్టీఆర్ చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే చిరంజీవి ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు అంటు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక ఆంధ్రావాలా స్టోరీని ముందుగా పూరి జగన్నాథ్ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు వినిపించాడట.

Written By: Neelambaram, Updated On : January 19, 2024 3:30 pm

Puri jagannadh Chiranjeevi

Follow us on

Puri jagannadh – Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్..ఈయన చేసిన సినిమాల్లో హీరోలా క్యారెక్టరైజేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే తెలుగులో హీరోల క్యారెక్టరై జేషన్ మీద కథను రాసి హిట్టు కొట్టే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పూరి జగన్నాధ్( Puri jagannadh ) అనే చెప్పాలి.

ఈయన చేసిన ప్రతి సినిమాలో కూడా హీరోకి సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. అందువల్లే హీరో క్యారెక్టర్ మనకు చాలా సంవత్సరాలుగా గుర్తుండి పోతుంది. ఇడియట్ లో చంటి క్యారెక్టర్ అయిన, పోకిరి లో పండు క్యారెక్టర్ అయిన, శివమణి లో నాగార్జున క్యారెక్టర్ అయిన ఇవన్నీ కూడా మన అందరిని మెస్మరైజ్ చేసి మన చేత 100 కు 100 మార్కులు వేయించుకున్న క్యారెక్టర్లు…

Also read : చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ యంగ్ హీరో…

ఇక ఈయన ఎన్టీఆర్ తో చేసిన ఆంధ్రావాలా సినిమా చిరంజీవి చేయాల్సింది. కానీ చిరంజీవి( Chiranjeevi ) రిజెక్ట్ చేయడం వల్ల అది ఎన్టీఆర్ చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే చిరంజీవి ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు అంటు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక ఆంధ్రావాలా స్టోరీని ముందుగా పూరి జగన్నాథ్ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు వినిపించాడట. దాంతో చిరంజీవి అందులో కొన్ని మార్పులు, చేర్పులు చెప్పడంతో పూరి ఆ మార్పులు చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు. దాంతో ఇదే కథని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లి ఆయనకి చెప్పి, ఒప్పించి ఈ సినిమా చేశాడు కానీ ఇది భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూరి జగన్నాథ్ కి చిరంజీవితో సినిమా చేసే అవకాశం అయితే రాలేదు. ఇక ఎన్టీఆర్ కి మాత్రం పూరి ఆ సినిమాతో భారీ ఫ్లాప్ ని ఇచ్చినప్పటికి ఆ తర్వాత మాత్రం టెంపర్ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు…

Also read :  ప్రభాస్ కి మళ్ళీ ఆపరేషన్..? ఆందోళనలో ఫ్యాన్స్!

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి రీ ఎంట్రీ లో ఆయన తో సినిమా చేసే అవకాశం పూరి జగన్నాథ్ కి వచ్చినప్పటికీ ఆయన చెప్పిన కథ చిరంజీవికి నచ్చకపోవడంతో పూరి తో సినిమాని చేయలేకపోయాడు. కానీ పూరి మాత్రం చిరంజీవి అభిమాని అవ్వడంతో ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయాలనే ధృడ సంకల్పంతో ఆయన ఉన్నట్టు గా తెలుస్తుంది. మరి ఫ్యూచర్ లో అయిన ఆయన డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం పూరి రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది…