Pooja Hegde: నలుగురిని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నోళ్లు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. డబ్బుల కోసం వెంపర్లాడకుండా జీవితం,కెరీర్ ఇచ్చిన ప్రజలు, ప్రేక్షకుల గురించి ఆలోచించాలి. ఈ మధ్య కొందరు స్టార్స్ దీనిని వదిలేశారు. డబ్బులు ఇస్తే చాలు ఏం చేయడానికైనా సిద్ధమని నిరూపిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు.

దానికి కోసం ఆమె స్వయంగా ఓ పెగ్ కలుపుకొని తాగి చిందేశారు. వీకెండ్ సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉండాలి అంటూ… పచ్చిగా ప్రవర్తించారు. ఆల్కహాల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ నిర్వహించడం మన దేశంలో నిషిద్ధం. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే మత్తు పదార్థాలను ఎటువంటి మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేయకూడని నియమం ఉంది. అయితే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలకు ఇది వర్తించడం లేదు.
దీంతో ఇంస్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫార్మ్స్ ద్వారా సెలెబ్రిటీలతో ఆల్కహాల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాయి సంస్థలు. తాజాగా పూజా హెగ్డే రెడ్ లేబుల్ ప్రీమియం విస్కీ బ్రాండ్ కి ప్రచారం కల్పించారు. సదరు బ్రాండ్ తాగితే ఫుల్ ఎంజాయ్ అన్నట్లు క్రేజీ స్టెప్స్ తో రెచ్చిపోయారు. మందు తాగి చిందేస్తున్న వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.
View this post on Instagram
ఆ వీడియోని దాదాపు మూడు మిలియన్స్ నెటిజెన్స్ వీక్షించారు. డబ్బుల కోసం కనీస బాధ్యత లేకుండా జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు పూజా లాంటి స్టార్స్. ఆ మధ్య కాజల్ అగర్వాల్ సైతం భర్త గౌతమ్ తో కలిసి మందు తాగుతున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అలా ఓ ఆల్కహాల్ బ్రాండ్ కి ప్రమోషన్ కల్పించారు.
Also Read: Pooja Hegde: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్.. ఇంత చీప్ టేస్ట్ అనుకోలేదంటూ ట్రోల్స్!
గుడ్డిలో మెల్ల అన్నట్లు… ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, పద్దతిగా తాగండి అంటూ ఓ ఉచిత సలహా విసిరింది. స్టార్స్ గా చేతినిండా ఆఫర్స్ తో కోట్లు సంపాదిస్తూ కూడా ఇలాంటి దిగజారుడు వ్యవహారాలకు పాల్పడడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Pooja Hegde: సక్సెస్ నెత్తికెక్కి ఎక్కువ చేస్తే… త్వరగా సర్దుకోవాల్సి వస్తుంది!