https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నా.. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలో మేకర్స్ నుంచి ఓ బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఉత్తరాది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పెన్ స్టూడియోస్’ వారు భారీ అంచనాలు ఉన్నా ఈ అత్యంత భారీ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకుందని మేకర్స్ స్పష్టం చేశారు. పైగా మిగతా […]

Written By: , Updated On : April 1, 2021 / 12:22 PM IST
Follow us on

RRR movie
క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నా.. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలో మేకర్స్ నుంచి ఓ బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఉత్తరాది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పెన్ స్టూడియోస్’ వారు భారీ అంచనాలు ఉన్నా ఈ అత్యంత భారీ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకుందని మేకర్స్ స్పష్టం చేశారు.

పైగా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను కూడా ‘పెన్ స్టూడియోస్’ వారు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమా హక్కులకు గానూ రికార్డ్ రేంజ్ లో భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏమైనా నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుండంతో సినిమాకి మార్కెట్ కూడా ఆ రేంజ్ లో అట్టహాసంగా జరుగుతుంది.

పైగా అన్నిటికి మించి ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది. ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి, ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాకపోవచ్చు. అందుకే ఈ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి బయ్యర్లు వెనుకాడటం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్