Homeఅప్ కమింగ్ మూవీస్సీక్రెట్ గా సెట్ వేయిస్తోన్న నాగ్ !

సీక్రెట్ గా సెట్ వేయిస్తోన్న నాగ్ !

కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. అయితే, ఈ యాక్షన్ డ్రామా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దగ్గర ఉండి మరీ, ఈ సెట్ తాలూకు యాక్టివిటీస్ ను చూసుకుంటున్నారు. జూన్ 18 నుండి ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

కాబట్టి, అప్పటిలోగా ఈ సెట్ ను పూర్తి చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి అయింది. ఐతే ఆ షెడ్యూల్ లో కొంత భాగం షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రత తగ్గిన వెంటనే.. అవకాశం ఉంటే.. లాస్ట్ షెడ్యూల్ లోని సీన్స్ ను షూట్ చేసి ఆ తరువాత కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట.

మొత్తానికి నాగార్జున ఈ సారి గట్టిగానే వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. వాస్తవానికి లాక్ డౌన్ కారణంగా బయట వేయాల్సన సెట్ వేయడానికి కుదరలేదు. దాంతో నాగ్ కలుగజేసుకుని తన స్టూడియోలో సీక్రెట్ గా సెట్ వేయమని సూచించి.. లీగల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూకున్నాడట. అందుకే అనుకున్న టైంకే ఈ సెట్ ను పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తీ కాగానే నాగ్ “బంగార్రాజు” సినిమాని స్టార్ట్ చేస్తాడట. అయితే ఈ సినిమా నుండి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కానీ ఈ సినిమా ఉంటుంది అనే వార్త సంవత్సరాల తరబడి ఇంకా కొనసాగుతూనే ఉంది. కుదిరితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుండి స్టార్ట్ చేస్తారట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version