
మహానటితో ‘కీర్తి సురేష్’ ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది. దాంతో ఆమె ప్రధాన పాత్రల్లో వస్తోన్న సినిమాలు ఎక్కువైపోయాయి. కాకపోతే కీర్తి సురేష్ ఇటీవల నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక ప్లాప్ చిత్రాలుగా మిగిలిపోతున్నాయి. లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన కీర్తి ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఓటిటి చరిత్రలోనే ఈ రెండు సినిమాలు అయినంత ప్లాప్ మరో ఏ సినిమా అవ్వలేదు అంటేనే.. కీర్తి నుండి ఎలాంటి బ్యాడ్ సినిమాలు వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అనేసరికి, కథలు బాగాలేకపోయినా.. సినిమాలో తనే మెయిన్ అనే ఉత్సహంతో కీర్తి సురేష్ సినిమాలు ఒప్పుకుంటుంది అంటూ ఆమె పై ఆరోపణలు కూడా వచ్చాయి ఆ మధ్య. దాంతో అసలు కెరీర్ కే ఎసరు వచ్చేలా ఉంది అనుకున్న కీర్తి.. మొత్తానికి ఇక నుండి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువుగా నటించను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కీర్తి హీరోయిన్ గా నటిస్తోన్న సినిమాలు కూడా భారీ ప్లాప్ లుగా నిలుస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ‘రంగ్ దే’తో హిట్ కొడుదామనుకుని ఆ సినిమా కోసం ప్రమోషన్స్ ను కూడా బాగా చేసింది కీర్తి. కానీ ఆ సినిమా కూడా ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు. ‘రంగ్ దే’ మొదటి షో నుండి బ్యాడ్ టాక్ వచ్చింది. అయితే ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ వచ్చేసరికి, సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తానికి కీర్తి సురేష్ ప్లాప్ ల పరంపరలో రంగ్ దే కూడా చేరింది.
ఇప్పుడు ఇదే మహేష్ అభిమానులను భయపెడుతుందట. కీర్తి సురేష్ బ్యాడ్ టైం మహేష్ సినిమాకి తగులుతుందేమో అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ భారీ సినిమా ‘సర్కారు వారి పాట’లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి మహేష్ బాబు సరసన నటిస్తోంది కాబట్టి ఆమె ఫేట్ మారుతుందా లేక, ఆమె బ్యాడ్ టైం మహేష్ సినిమాకే తగులుతుందా అనేది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్