
జాతిరత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఏజెంట్ ఆత్రేయతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేసిన నవీన్.. జాతిరత్నాలుతో వెంటపడేట్టు చేసుకున్నాడు. ఇప్పుడు నవీన్ తో సినిమాలు నిర్మించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే యువి క్రియేషన్స్ ఓ సినిమా కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నవీన్-అనుష్క జంటగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇందులో మిడిల్ ఏజ్ లో ఉన్న మహిళగా అనుష్క.. పాతికేళ్ల కుర్రాడిలా నవీన్ కనిపించబోతున్నారట. మరోవైపు దిల్ రాజు కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే అగ్రిమెంట్ కూడా తీసుకున్నాడని సమాచారం.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే సూపర్ స్టార్ మహేష్ కూడా నవీన్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ నిర్మాతగా వ్యవహరించనుండగా.. వెంకీ కుడుముల దర్శకత్వం చేయనున్నట్టు సమాచారం. ఛలో, భీష్మ వంటి వరుస హిట్లతో తానేంటో నిరూపించుకున్నాడు వెంకీ. ఈ క్రమంలోనే రామ్ చరణ్, మహేష్ తో సినిమాలకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ వచ్చింది.
అయితే.. మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రాలేదుగానీ, ఆయన నిర్మాణంలో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాతో గనక హ్యాట్రిక్ కొడితే.. ఖచ్చితంగా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం రావొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్