
యూత్ ఫుల్ లవర్ బాయ్ గా పేరు సంపాదించి అన్ని అలాంటి సినిమాలే తీస్తున్న యువ హీరో నితిన్ వరుసగా సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తూ జోష్ మీద ఉన్నాడు. ఇటీవలే నితిన్ హీరోగా ‘రంగ్ దే’ వచ్చి మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.
తాజాగా మరో సినిమాను నితిన్ ప్రకటించాడు. నితిన్ హీరోగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రిమేక్ ఇదీ.నితిన్ తండ్రి, సోదరి నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. నల్లకళ్లద్దాలు ధరించి చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకొని ఉన్న నితిన్ లుక్ చూస్తే ఇందులో అంధుడిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే పియానోపై రక్తపు మరకలు కనిపించడంతో ఈ మూవీ ఒక క్రైం థ్రిల్లర్ అని అనిపిస్తోంది. నితిన్ నీళ్లలో మునిగిపోతుండడం కళ్లు తెల్లగా ఉండడం చూస్తుంటే అతడు అంధుడని తెలిసిపోతోంది.
‘మాస్ట్రో’ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఆసక్తికరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. మీరూ చూసేయండి.