Varun Tej-Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొత్త పుకార్లు పుట్టించారు. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందని సినీ ప్రముఖులు కూడా చాలా ఉత్సాహంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతకీ వరుణ్ పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ లావణ్య త్రిపాఠి అని రూమర్స్ వస్తున్నాయి. లావణ్యతో వరుణ్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, ఆమె వరుణ్ తో ఏడడుగులు వేయబోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

పైగా ప్రస్తుతం వరుణ్ – లావణ్య హాలీడే ట్రిప్‌లో ఉన్నారంటూ వదంతులు బాగా వినిపించాయి. అయితే, లావణ్య ఒక్క ఫొటోతో ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం తాను డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో ఉన్నానంటూ ఫొటోలు పోస్ట్ చేసి వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది. మరి వరుణ్ – లావణ్య పెళ్లి పీటలెక్కబోతున్నారు అంటూ వస్తున్న ఊహాగానాల పరిస్థితి ఏమిటి ? అసలు ఈ పుకార్లు ఊపందుకోవడానికి కారణం ఏమిటి ?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ తేజ్ తో ఏడడుగులు వేయబోతున్న విషయం పై ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అటు వరుణ్ తేజ్ కూడా ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావణ్య కనిపించింది.
Also Read: పూరి మ్యూజింగ్స్: హాలీవుడ్ ఎలా పుట్టిందో తెలుసా ?
ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే నిహారిక పెళ్లికి వెళ్ళింది. అలాంటిది మరి, లావణ్య ఎలా వెళ్ళింది ? అంటూ అప్పుడే రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొత్తమ్మీద ఆ పుకార్లకు తాజాగా వీరి ప్రవర్తన మరింత ఊతమిచ్చినట్లైంది. ఇక లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫొటోలు షేర్ చేస్తూ ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
లావణ్య మెసేజ్ ఏమి చేసింది అంటే.. ‘ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాను. మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్నాను’ అని పోస్ట్ పెట్టింది. ఐతే, నెటిజన్లు కూడా ఆమెకు ఘాటుగా రిప్లయ్ ఇస్తూ మరి ఆ అందాలను వరుణ్ కూడా ఆస్వాదిస్తున్నాడా ?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: ఇవన్నీ కేవలం పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన ‘సర్కారు..’ టీమ్ !
[…] Dhanush: ధనుష్, ఐశ్వర్యల డివోర్స్ ఇష్యూ పై కోలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి ‘కస్తూరి రాజా’ ఈ విడాకుల వివాదం పై వివరణ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా సర్వ సాధారణం అని అందరికి తెలుసు. అయితే, ధనుష్, ఐశ్వర్యల మధ్య కూడా అలాంటి గొడవలే జరిగాయి. పైగా ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో మాతో లేరు. […]