Jai Balayya Song: వైరల్ అవుతున్న ‘జై బాలయ్య’ ఫుల్ వీడియో !

Jai Balayya Song: నటసింహం బాలయ్య అఖండ భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదో వారంలో కూడా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గ లేదు. ఐతే ఈ సినిమా నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్ ‘జై బాలయ్య’ ఫుల్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఈ పాటకు బాలయ్య డ్యాన్స్ కు ఫుల్ విజిల్స్ పడ్డాయి.

Jai Balayya Song
Jai Balayya Song

Also Read: చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?

ఈ పాటలో బాలయ్య తన స్టైల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేసి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. బాలయ్య అభిమానులను మాత్రమే కాకుండా.. ప్రేక్షకులందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది ఈ పాట. తమన్ కూడా అద్భుతమైన సంగీతం అందించాడు. ఏది ఏమైనా ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు.

ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కేటాయించాడు. అయితే, ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా ఫిక్స్ చేశాడు బాలయ్య. ఇప్పటికే అనిల్ కూడా ఎఫ్ 3 సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం అనిల్ మార్చి నుంచి బాలయ్య సినిమా పైకి రానున్నాడు. ఎలాగూ స్క్రిప్ట్ కూడా అయిపోయింది. కాబట్టి బాలయ్య డేట్లు ఇస్తే షూట్ చేసేద్దాం అనే కోణంలో అనిల్ ఉన్నాడు.

Also Read: అతిధి దేవోభవ’ దారుణాతి దారుణం.. మరీ ఇంత డిజాస్టరా ?

Get notified whenever we post something new!

Continue reading

KCR Ganesh : కేసీఆర్ ‘వినాయకుడా’ మజాకా.. అట్లుంటది మరీ!

పోలీస్ ఎస్కార్ట్ తో ట్యాంక్ బండ్ వచ్చిన సీఎం క్యాంప్ ఆఫీస్ గణేశుడిని క్రేన్ నంబర్ 3 వద్ద క్యాంప్ ఆఫీస్ సిబ్బంది, పూజారి టీం నిమజ్జనం పూర్తి చేశారు.

KCR vs Journlists : ‘కేసీఆర్’ రాజ్యం.. వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వం

మాటలు జాగ్రత్త కేసీఆర్.. అధికారం శాశ్వతం కాదు.’ అంటూ సోషల్ మీడియాలో పలువురు జర్నలిస్టులు పోస్టులు పెడుతున్నారు.

Chiranjeevi – Star Hospitals : చిరంజీవి సేవా నిరతి.. వాళ్ల కోసం ఉచిత క్యాన్సర్ క్యాంప్

ఈ ఉచిత క్యాన్సర్ క్యాంప్ ను మొదట ఈనెల 16న విశాఖపట్నంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. దీనికి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version