
సినిమా ప్లాప్ అయితే ఇక అంతే. అప్పటికే ఫిక్స్ అయిన కాంబినేషన్ లు కూడా క్యాన్సల్ అవుతాయి. ఎప్పటినుండో మంచి అనుబంధం ఉన్న సంబంధాలు కూడా మధ్యలోనే రద్దు అయిపోతాయి. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు హీరో కార్తికేయ, డైరెక్టర్ సుకుమార్. కార్తికేయ హీరోగా సుకుమార్ రైటింగ్స్ తో సినిమా ఉంటుంది అని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.
నిజానికి ‘చావు కబురు చల్లగా’ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుని, కార్తికేయకి వచ్చే మార్కెట్ ను తానూ క్యాష్ చేసుకోవాలని తెగ ఉబలాట పడ్డాడు సుకుమార్. కానీ చివరకు ‘చావు కబురు చల్లగా’ సినిమాకి విడుదలకు ముందు ఉన్న హడావిడి, విడుదల తరువాత లేదు. పైగా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాకి కనీస విలువ కూడా లేకుండా పోయింది. మొత్తానికి కార్తికేయకి భారీ హిట్ వస్తోంది అనుకుంటే.. ఆ సినిమా పెద్ద ఢమాల్ అనిపించుకుంది.
దీంతో కార్తికేయ తరువాత సినిమాల పై ఇప్పుడు ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ మధ్యలో సుకుమార్ కార్తికేయతో నిజంగా సినిమా నిర్మిస్తాడా ? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరోపక్క సుకుమార్ తన శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ, తన డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాస్తున్నట్లు చెపుతూ … సినిమా నిర్మాణాలు చేయాలని.. పెద్ద ప్లాన్ వేసుకున్నాడు.
కనీసం తన ప్లాన్ కోసమైనా.. సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ సినిమా ఉంటుందా ? ఇప్పటికైతే ఈ సినిమా గురించి కార్తికేయకి ఎలాంటి అప్ డేట్ రాలేదట. పైగా తనే ఫోన్ చేస్తే.. కార్తికేయ ఫోన్ కి ఎవ్వరూ ఆన్సర్ కూడా చేయలేదు అట. అయితే సుకుమార్ మాత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఇప్పటికే ‘ఉప్పెన’, ‘కుమారి 21 ఎఫ్’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న సుక్కు, ఈ సారి కూడా సక్సెస్ అవ్వాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కానీ కార్తికేయతో మూవీ నిర్మిస్తాడా లేదా అన్నది చూడాలి.