
‘దివ్యంశ కౌశిక్’ బహుశా ఈ పేరు మర్చిపోయి ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా..ఒక్కోసారి అదృష్టం కలిసి రాదు, అలాంటి అదృష్టం లేని హీరోయినే ఈ ‘దివ్యంశ కౌశిక్’. మజిలీ లాంటి భారీ హిట్ అందుకున్నాక కూడా అవకాశం లేక మూడేళ్ళ నుండి ఖాళీగా కూర్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. నిజంగా ఈ బ్యూటీ టాలెంట్ పరంగా, గ్లామర్ పరంగా ఏ మాత్రం వంకపెట్టలేం. అయినా అవకాశం ఎందుకు రాలేదో పాపం. అయితే ఎట్టకేలకూ మళ్ళీ మూడేళ్ళ తరువాత.. రవితేజ కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
శరత్ మండవ డైరక్షన్ లో రానున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారు. మెయిన్ హీరోయిన్ గా దివ్యంశ కౌశిక్ కావడం విశేషం. ‘మజిలీ’ సినిమాలో చూడగానే బాగుంది అనిపించుకుంది. పైగా మజిలీలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఈ అమ్మడు చాలా బాగా ఆకట్టుకుంది. అయినా అమ్మడికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు అట. చాలా నెలలు పాటు అవకాశాల కోసం ఈమె ఎదురుచూసిందట.
కానీ ఒక్క దర్శకుడు కూడా ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తానికి రవితేజ పుణ్యమా అని ఈ బ్యూటీకి మళ్ళీ ఇంకో సినిమా దక్కింది. అయితే ఈమెకు ఛాన్స్ ఇవ్వడం వెనుక ‘దర్శకుడు శరత్ మండవ’ చక్కని వివరం ఇచ్చాడు. దివ్యంశ కౌశిక్’కి తెలుగు రాకపోయినా.. మజిలీలో ఎక్కడా ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్ గా నటించింది, నిజానికి మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోవడం వల్లే.. దివ్యంశ కౌశిక్’కి రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. దాంతో ఆమెకు పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు. కానీ ఆమె చాల మంచి నటి. అందుకే ఆమెను మా సినిమాలో తీసుకున్నాం అంటూ మొత్తానికి దర్శకుడు చెప్పుకొచ్చాడు.