Bandla Ganesh: ‘బండ్ల గణేష్’ అనగానే పవన్ కళ్యాణ్ భక్తుడు అని గుర్తుకు వస్తోంది. నిజానికి నిర్మాతగా తెలుగు తెర పై పరిచయం అవసరం లేని పేరు ప్రఖ్యాతలు తనకు వచ్చినా.. బండ్ల గణేష్ మాత్రం పవన్ కళ్యాణ్ భక్తుడు అని పిలిపించుకోవడానికే ఆసక్తి చూపిస్తాడు. పైగా బండ్ల గణేష్ కి మెగా హీరోలంటే బాగా ఇష్టం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే బండ్ల గణేష్ కి ప్రాణం.

అందుకే, మెగాస్టార్ ఫాలోవర్ గా బండ్ల ఇండస్ట్రీలో బాగానే హడావిడి చేస్తుంటాడు. ఐతే, ‘తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం తనకు ఇష్టం లేదు’ అంటూ తాజాగా చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెద్ద అనే హోదా తనకిష్టం లేదని మెగాస్టార్ చాలా క్లారిటీగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై నిర్మాత బండ్లగణేశ్ తనదైన శైలిలో స్పందించాడు.
Also Read: ఆచార్య ‘వచ్చిందే మందాకినీ’.. పక్కా మాస్ గురూ !
మెగాస్టార్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్విటర్ వేదికగా బండ్ల్ గణేష్ ఒక మెసేజ్ ను పోస్ట్ చేస్తూ.. ‘సూపర్ సర్.. బాగా చెప్పారు’ అని ట్వీట్ చేశాడు. అన్నట్లు బండ్ల గణేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కూడా బండ్లకు అవకాశం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నాడు. పైగా కథను కూడా బండ్ల రెడీ చేయించాడు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” సినిమాను నిర్మించి నిర్మాతగా తనకంటూ ఓ రెండు మూడు హిట్లును అందుకున్న క్రెడిట్ బండ్లకు దక్కింది. మళ్ళీ, ఇప్పుడు మరో సినిమా నిర్మించాలని ఆశ పడుతున్నాడు. అది కూడా హిట్ అయితే.. నిర్మాతగా బండ్లకు మరో పదేళ్లు లైఫ్ ఉంటుంది.
దాని కోసమే ఈ బాధ ఏమో. అన్నట్టు బండ్లలో ఆవేశమే కాదు, సాయం చేసే గుణం కూడా ఉంది. ఈ మధ్య ఆర్థికంగా చాలా ఇబ్బంది ఆడుతున్న వారికీ సాయం చేస్తున్నాడు.
Also Read: ‘మా’, మోహన్ బాబు ఎఫెక్ట్: చిరంజీవి సంచలన నిర్ణయం !