Homeఎంటర్టైన్మెంట్Bollywood: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పై కేసు నమోదు... ఫీల్ అవుతున్న కత్రీనా...

Bollywood: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పై కేసు నమోదు… ఫీల్ అవుతున్న కత్రీనా ?

Bollywood: కొత్త ఏడాది బాలీవుడ్ కొత్త పెళ్లి జంటకు పోలీసులు షాక్ ఇచ్చారు. కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయ్యి ఇంకా ఒక నెల కూడా గడవక ముందే కొత్త పెళ్లి కొడుకు చిక్కల్లో పడ్డాడు. విక్కీ కౌశల్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లుకా చుప్పి 2’. ఈ మూవీ షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరుగుతోంది. ఈ సినిమాలోని వారి లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పై భారీగా అంచనాలు ఉన్నాయి.

police complaint files on bollywood hero vicky kaushal

ఇప్పుడు తాజాగా విక్కీ కౌశల్ పై ఇండోర్ కి చెందిన జైసింగ్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పర్మిషన్ తీసుకోకుండా తన ద్విచక్ర వాహనం నెంబర్ ను విక్కీ తన సినిమా వాడారంటూ జైసింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సినిమా నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్‌ లీకైంది. ఇందులో సారా అలీ ఖాన్‌ను, విక్కీ కౌశల్ బైక్‌ పై తీసుకెళ్తూ కనిపించాడు. ఈ సన్నివేశంలో తన బైక్ నెంబర్ వాడుకున్నారంటూ జైసింగ్ మండిపడ్డాడు. ఆ సన్నివేశంలో విక్కీ నడుపుతోన్న బైక్ నెంబర్ నాది అని చెప్పాడు జైసింగ్. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో తనకు తెలియదని… కానీ అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహనం నెంబర్ వేరొకరు వాడడం చట్ట వ్యతిరేకమని చెప్పాడు జైసింగ్.

అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు జైసింగ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై స్పందించిన పోలీస్ అధికారు.. కంప్లైంట్ వచ్చిన మాట నిజమేనని.. ఒకవేళ చిత్రబృందం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే మోటార్ సైకిల్ యాక్ట్ కింద వాళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనడానికి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ముంబైకి వచ్చారు విక్కీ కౌశల్. తన భార్య కత్రినాతో వేడుకలు జరుపుకున్న తరువాత తిరిగి ఇండోర్ కు బయలుదేరారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular