
బాలయ్య బాబు సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. ప్రస్తుతం ఆయన ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకి మాస్ టైటిల్ నే పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. అలాగే టీజర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘మోనార్క్’ అనే టైటిల్ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని.. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ఈ టైటిల్ ఫ్రీ లుక్ పోస్టర్ ను కూడా త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేస్తారట. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్ల షూటింగ్ జరుగుతోంది. అన్నట్టు ఈ సినిమాకి కథ రొటీన్ గా ఉన్నా, యాక్షన్ పవర్ ఫల్ గా ఉంటుందట.
మొత్తానికి ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో అభిమానులను ఫుల్ గా అలరించారు. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో. ప్లాప్ అయితే మాత్రం ఇక బాలయ్యకి మార్కెట్ పూర్తిగా పోతుంది.
Comments are closed.