బబ్లీ బ్యూటీ శ్రీముఖి మే 10న తన పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకుంది. ఈ బర్త్ డే పార్టీలో ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పాల్గొని తెగ హడావిడి చేశారు. అయితే తన బర్త్ డేని మొత్తానికి వైల్డ్ గా సెలెబ్రేట్ చేసుకొంది శ్రీముఖి. ముఖ్యంగా శ్రీముఖి ఫ్రెండ్స్ ఆమెను కేకులో ముంచేశారు. ఆమె ముఖం నిండా అలాగే ఆమె బాడీ నిండా మొత్తం కేక్ ను పూశారు.
తనను తన స్నేహితులు కేకులో ముంచిన ఫోటోని, శ్రీముఖి తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. ఫోటో చూస్తుంటేనే శ్రీముఖి పుట్టినరోజు ఎలా జరిగిందో అర్ధమవుతుంది. ఇక శ్రీముఖి వయసు ప్రస్తుతం 29 ఏళ్ళు. ఆమె ఈ పుట్టిన రోజుతో 29వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇక తానూ 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటాను అంటూ గతేడాదే సగర్వంగా అందరికీ చాటి చెప్పింది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలతో, అలాగే యూట్యూబ్ ప్రోగ్రామ్స్ తో ఫుల్ బిజీగా ఉంది. యాంకర్ గానే కాకుండా, పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. అయితే తనకు టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ, సినిమాల్లో మాత్రం చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవని శ్రీముఖి తెగ ఫీల్ అవుతుంది. వెండితెరైనా బుల్లితెరైనా శ్రీముఖి తనకున్న గ్లామర్ ను ఒళ్ళు దాచుకోకుండా బాగానే ప్రదర్శన చేస్తోంది కాబట్టి, ఆమె సినిమాల్లో కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.