
నిజ జీవితంలో మావోయిస్టులు / నక్సలైట్లు ఎలా ఉంటారో మీడియాలో చూసి ఉంటారు. లేదంటే.. ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో చూసి ఉంటారు. ప్రజల కోసం పోరాడుతూ తిండీ తినకా.. పచ్చని అడవుల్లో ఎండిపోయిన ఆకుల్లా కనిపిస్తారు. కానీ.. ‘ఆచార్య’ టీమ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో చిరు, చరణ్ ఫుల్ గ్లామరస్ గా కనిపించడం విశేషం.
ఈ లుక్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో డిస్కషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ మధ్యనే విడుదలైన అరణ్య సినిమాలో రానా మేకప్ అచ్చం అడవిలో ఉండే మనిషిలాగనే ఉంది. వెంకీ నారప్పలోనూ, దాని ఒరిజినల్ మూవీ అసురన్ లో ధనుష్ మేకప్ కూడా పాత్రకు తగ్గట్టుగా ఆకట్టుకుంది.
అయితే.. మెగా హీరోలు ఏ పాత్ర చేసినా, అందంగా ఉండాల్సిందేనా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. వీళ్లు గ్లామర్ అనే విషయం ఓకే.. కానీ, కష్టాల్లో ఉండే పాత్రల్లో నటిస్తూ వాటిని కూడా గ్లామర్ గా ఉండేలా చూపిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆచార్య యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ తపంచాలు పట్టుకొని వస్తూ కనిపించారు. వీరి హెయిర్ స్టైల్, మేకప్, ఇంకా వాళ్లు ధరించిన ట్రవుజర్స్, ట్రిమ్ చేసిన గడ్డం ఇవన్నీ మోడ్రన్ గా ఉండడంతో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. నక్సలైట్లు కూడా ఇంత అందంగా ఉంటారా? అని అంటున్నారు.