Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ మొత్తానికి సుధీర్ బాబు టీజర్ తో వచ్చాడు. సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో సుధీర్ బాబు పాత్ర ఆసక్తిగా ఉంది. టీజర్ ను చూస్తుంటే.. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. ‘రోల్ సౌండ్.. రోల్ కెమెరా.. యాక్షన్’ అని సుధీర్ బాబు డైలాగ్ తో మొదలైన ఈ సినిమా టీజర్ బాగుంది అనే టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు ఆరు హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా నటిస్తున్నాడు. ఒక దర్శకుడిగా సుధీర్ బాబు ‘ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ జరిగే కథ తీద్దామని’ ఓ సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టిని నటించమని వెంట పడుతూ ఉంటాడు. టీజర్ లో మ్యాటర్ ఉంది ఇంతే. సినిమాలో డాక్టర్ అయిన కృతి శెట్టికి అసలు సినిమాలు అంటే ఇష్టం ఉండదు.
Also Read: టాలీవుడ్ కి దొరికిన మరో లక్కీ హీరోయిన్

ఈ పాయింట్ శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఉంది. పైగా ఆ సినిమాలోనూ కృతి శెట్టినే హీరోయిన్. మరి సేమ్ పాయింట్ తో సినిమా ఎలా చేసాడో ఇంద్రగంటి మోహన్ కృష్ణ. టీజర్ బాగున్నా.. సినిమా కథలో పెద్దగా కొత్తదనం లేదు అని ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా టీజర్ సినిమా పై అంచనాలను పెంచలేకపోయింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.