
టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్‌లో ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమెకు కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈమె ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ముంబైలోనొ తన నివాసానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిందీ అమ్మడు. అమె ఇంటికి రాగానే తల్లిదండ్రును హగ్ చేసుకోవడం లాంటి వీడియోను ఆమె పోస్టు చేసింది. అయితే కరోనా నుంచి ఇంత త్వరగా కోలకుంటానని అనుకోలేదని, ఇప్పుడు నేనే ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉందని తమన్నా చెప్పారు.