
కరోనా మహమ్మారి సినీ రంగ ప్రముఖులపై పంజా విసురుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కుమారు సానుకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దురదృష్టవశాత్తూ నన్ను కరోనా లొంగదీసుకుంది నా ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థించడండి అంటూ కుమార్ సాను అభిమానులకు తెలిపారు. కుమార్ సాను తెలుగులో చాలా పాటలు పాడారు. 30 భాషల్లో 21 వేల పాటలు పాడి రికార్డు సృష్టించారు. గాయకుల్లో ఇటీవల పాప్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే..