Homeసినిమా బ్రేకింగ్ న్యూస్డిసెంబర్ 12 నుంచి హైదరాబాద్‌లో పుష్ప ఘాటింగ్

డిసెంబర్ 12 నుంచి హైదరాబాద్‌లో పుష్ప ఘాటింగ్

 

లెక్క

మాస్టారు సుకుమార్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 10 నుండి డిసెంబర్ 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమల్లి అటవీ ప్రాంతంలో ఓ షెడ్యూల్ జరుపుకోవలసి ఉంది. కాని చిత్ర బృందంలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి స్వీయ నిర్భందంలోకి వెళ్ళారు. ఇక ఇప్పడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రచారం జరుగుతుంది. పుష్ప చిత్రం తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 12 నుండి హైదరాబాద్‌లో జరుపుకోనుందని తాజా సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత జనవరిలో మారేడుమల్లి అడవులలో మేజర్ షూటింగ్ జరుపుకోనుందట. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular