
బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ పై ఓ నటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనని వేధింపులకు గురి చేశాడంటూ నటి లువియానా లోధ్ పేర్కొన్నారు. లువియానా, సుమిత్ సబర్వాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సుమిత్, మహేశ్ భట్ కు దగ్గరి బంధువు. అయితే సుమిత్ గురించి చాలా రోజుల తరువాత డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే విషయం తెలియడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లానన్నారు. ఈ విషయాలు తెలిసిన సుమిత్ బంధువైన మహేశ్ భట్ నుంచి తనకు ప్రమాదం ఉందని ఓ వీడియో తీసి ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేశారు. ఇదివరకు మహేశ్ భట్ పై వేధింపుల కేసు నమోదైందని, కానీ పోలీసులు పట్టించుకోలేదని, ప్రస్తుతం తన కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుడదనే ముందు జాగ్రత్తతోనే ఈ వీడియో పోస్టు చేస్తున్నానని లువియానా తెలపారు.