Homeసినిమా బ్రేకింగ్ న్యూస్గుండెపోటుతో ప్రముఖ సినీ దర్శకుడు మృతి

గుండెపోటుతో ప్రముఖ సినీ దర్శకుడు మృతి

శాండల్ వుడ్ కు చెందిన నిర్మాత, దర్శకుడు దినేశ్‌ శనివారం ఉదయం కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు సుదీప్‌ నటించిన ‘వీర మదకారి’ సినిమాకు దినేశ్‌ దర్శకత్వం వహించాడు. కొన్ని నెలల కిందట దినేశ్‌ గాంధీ తన కొడుకుతో కలిసి ఓ సినిమా తీయాలని యత్నించాడు. కానీ కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు చేపట్టలేకపోయాడు. దినేశ్‌ మృతిపై కన్నడ చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular