
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును, సినీ ప్రముఖులలైన చిరంజీవి, నాగార్జున, ఫిలిం చాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు ఆదివారం కలిశారు. కోవిడ్ తో నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవాలని వారు కోరారు. దీంతో కేసీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమను ఆదుకుంటామన్నారు. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు, కార్మకులకు పలు అంశాల్లో రాయితీలు, మినహాయింపులు కేటాయిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలో టీఆర్ఎస్ విడుదల చేసిన మెనిఫెస్టోలో సినిమాను ఆదుకునేనాల రూపొందిస్తామన్నారు. అనంతరం బయటకు వచ్చిన సినీ పెద్దలు చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.