
జనసేన అధినేత, టాలీవుడ్ నటుడు పవన్‌కల్యాణ్‌తో కన్నడ నటుడు సుదీప్ సోమవారం భేటి అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఆయనన కలిసి మొక్కను అందజేశారు. అనంతరం వారిద్దరు సుమారు గంటసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అయితే వారు రాజకీయంగా కలిశారా..? లేక సినిమాల కోసం భేటీ అయ్యారా..? అనే విషయం రకరకాలుగా చర్చ సాగుతోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం సినిమా థియేటర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి ఏదైనా సినిమా షూటింగ్‌లో పాల్గొంటారా..? అనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి వీరి కలియిక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments are closed.