
బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో వేధింపుల కేను నమోదైంది. ఇప్పటికే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ లాంటి ప్రముఖులు ఇలాంటి కేసులు ఇరుక్కోగా తాజాగా మరో బాలీవుడ్ నటుడిపై వేధింపుల కేసు నమోదైంది. నటుడు విజయ్ రాజ్ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్, గోండియాలోని హోటల్ గేట్ వే లో ‘షెర్ని’ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సమయంలో గోండియాలోని ఓ మహిళ తనను వేధించసాగాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్ రాజ్ ని అరెస్టు చేసి ఐపీసీ 354ఏ, ఢి కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయనను గోండియాలోని స్థానిక కోర్టు లో హాజరు పరిచారు. కాగా విజయ్ రాజ్ కి ప్రస్తతుం బెయిల్ లభించింది. ఇప్పటికే డ్రగ్స్ కలకలంతో సతమతమవుతున్న ఉన్న బాలీవుడ్ చిత్ర సీమకు ఇప్పడు వేధింపుల కేసులు ఎక్కువకావడంతో నిర్మాతలు, దర్శకులు ఆందోళన చెందుతున్నారు.