https://oktelugu.com/

సింగర్ పై అమలాపాల్ కోర్టులో ఫిర్యాదు: నోటీసులు పంపిన న్యాయస్థానం

తెలుగు, తమిళ నటి అమలాపాల్ బాలీవుడ్ సింగర్ పై కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన భవీందర్ సింగ్ తన అనుమతి లేకుండా ఫొటోలను భయపపెట్టి తన పరువు తీశాడని, పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. అమలాపాల్ తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన అమలాపాల్ గాయకుడు భవీందర్ సింగ్ తో ప్రేమాయణం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 4, 2020 / 01:40 PM IST
    Follow us on

    తెలుగు, తమిళ నటి అమలాపాల్ బాలీవుడ్ సింగర్ పై కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన భవీందర్ సింగ్ తన అనుమతి లేకుండా ఫొటోలను భయపపెట్టి తన పరువు తీశాడని, పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది.
    అమలాపాల్ తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిన అమలాపాల్ గాయకుడు భవీందర్ సింగ్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వినిపించాయి. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో భవీందర్ సింగ్ పోస్టు చేశాడు. ఇవి వైరల్ కావడంతో వాటిని ఆయన తొలగించాడు. దీనిపై స్పందించిన అమలాపాల్ ఆ పెళ్లి వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. దీంతో కోర్టును ఆశ్రయించడంతో భవీందర్ సింగ్ కు నోటీసులు పంపారు.