కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Also Read: క్రిస్మస్ ఆ దేశాల వారికి ప్రత్యేకం
ఏడాదికాలంగా సైంటిస్టులు కరోనాపై ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ కనుగోన్నారు. కొత్త ఏడాదిలో వ్యాక్సిన్ తో కరోనాకు చెక్ పెట్టాలని భావించారు. అయితే కరోనా కొత్త వైరస్ ప్రపంచానికి పెను సవాల్ విసిరింది.
ఇటీవల బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వైద్యులు గుర్తించారు. దీని వల్ల ఇటీవల ఆ దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవడంతో లాక్డౌన్ విధించినట్లు ప్రకటించాయి. అన్నిదేశాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే 70శాతం కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ మరణాలు తక్కువగా నమోదవుతుండటం కొంత ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తోంది.
అయితే ఈ కొత్త వైరస్ క్రిస్మస్.. న్యూఇయర్ వేడుకలపై ప్రభావం చూపేలా కన్పిస్తోంది. తాజాగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్రిస్మస్.. న్యూఇయార్ వేడుకలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: క్రిస్మస్ స్టార్ ప్రత్యేకత ఏంటీ..?
తెలంగాణలో కొంతకాలంగా ఉష్ణోగ్రత్తలు తక్కువగా నమోదవుతున్నాయని దీంతో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
డిసెంబర్ 25న క్రిస్మస్.. జనవరి 1న న్యూయర్ వేడుకలను ఈసారి ప్రజలంతా కుటుంబం సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. 60ఏళ్లు పైబడినవాళ్లు.. 10ఏళ్లలోపు చిన్నారులు.. గర్భిణులు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొద్దిరోజులు ఇంటికే పరిమితం కావాలని కోరారు.
మరో నాలుగు లేదా ఐదు వారాల్లో తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా విందులు.. వినోదాలకు దూరంగా ఉంటేనే మంచిదని సూచించారు.