Chanakya Niti: సంపద అంటే సంతృప్తిలోనే ఉంటుందని చెబుతారు. కొందరికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలనే కోరిక ఉంటుంది. మనిషి తన జీవితంలో ఎన్నో ఆటుపాట్లు పడుతుంటాడు. ఏవో సాధించాలనే కోరికతో ఉంటాడు. కానీ చివరకు తనకు ఏది ప్రాప్తమో దాంతోనే కాలం గడుపుతుంటాడు. మనిషికి బాధలు, దుఖం కలగడానికి గల కారణాలను ఆచార్య చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో చెబుతున్నాడు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందక మనిషి తన మనసును అదుపులో పెట్టుకోకుండా నిరంతరం ఏదో సాధించాలనే తపనతో శ్రమిస్తుంటాడు.
మనిషికి దుఖం కలగడానికి ప్రధాన కారణాల్లో భార్య భర్తను విడిచి వెళ్లిపోవడం అని చెప్పాడు. ప్రతి వ్యక్తి చిన్నప్పుడు తల్లితో యవ్వనంలో భార్యతో వృద్ధాప్యంలో పిల్లలతో ఉండటం సహజమే. కానీ కట్టుకున్న భార్య భర్తను వదిలేస్తే అతడికి దుఖమే కలుగుతుంది. ఎందుకంటే భర్తను భార్య తప్ప ఎవరు చూసుకోరు. అలాంటి సమయంలో భర్త పడే తపన మామూలుగా ఉండదు. మనిషికి భార్య దూరం కావడం ఓ శాపంగానే చెబుతున్నాడు. అందుకే జీవితంలో భార్యను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదని తెలుస్తోంది.
Also Read: Samantha: చైతన్యతో ఉన్న ఇంటినే మళ్లీ కొని ఉంటున్న సమంత.. అసలేమైంది? కారణమేంటి?
మనిషి బాధలకు మరో కారణం పేదరికం. డబ్బు సరిపడనంత లేనప్పుడు ప్రతి వ్యక్తి బాధలకు గురికావడం మామూలే. ఇటువంటి సమయాల్లో డబ్బు కోసం అడ్డదారులు తొక్కే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే డబ్బు కావాలనే యావలో ఎటు వెళ్తున్నాడో అర్థం కాని పరిస్థితి. అందుకే పేదరికం మనిషి ఎదుగుదలకు శాపమే. జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తి చెందక ఇంకా ఏదో కావాలనే ఉద్దేశంతో ఏవేవో దారులు వెతుకుతూ జీవితాన్ని నరకం చేసుకోవడంలో ప్రజలు తలమునకలవుతారు. కష్టాలు కొని తెచ్చుకుంటారు.
అప్పు చేసి పప్పుకూడు తినొద్దంటారు. అప్పు పుట్టింది అవ్వ అంటే కొంప మునిగింది కొడుకా అన్నదట. అప్పు అంత ప్రమాకరమైనది. కానీ అందరు అప్పులు చేసేందుకే ఇష్టపడతారు. కానీ చేసిన అప్పు త్వరగా చెల్లించకపోతే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోయామనే బాధ వ్యక్తమవుతుంది. అందుకే ఒకవేళ అప్పు చేసినా దాన్ని త్వరగా చెల్లించేందుకే మొగ్గు చూపాలి. అంతే కాని అప్పును కుప్పగా చేసుకుంటే జీవితంలో కష్టాలు తప్పవని గుర్తుంచుకోవాలి. అందుకే ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఈ బాధలకు గురికాకుండా ఉండాలంటే అతడు చెప్పిన వాటిని పాటించి జీవితాన్ని నందనవనంగా చేసుకోవాలని చెబుతున్నారు.
Also Read: Avoid Marital Troubles: కాపురంలో కలతలు రాకుండా ఉండేందుకు మార్గమేంటి?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Chanakya niti what makes a mans life miserable
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com