Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఆనాడే నీతి వాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి తన జీవితంలో ఎలా ఎదగాలి. ఎలా తన కెరీర్ ను మలుచుకోవలనే దానిపై కూలంకషంగా వివరించాడు. కష్టపడి పని చేస్తే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. మనిషి పుట్టుక కాదు అతడు చేసే పనులు అతడిని ఉన్నతంగా నిలబెడతాయి. ఎప్పుడైనా మన ఆలోచనలే మనకు దారి చూపిస్తాయి. మన ప్రణాళికలే మన విజయానికి మెట్లు అవుతాయని గుర్తుంచుకోవాలి. అందుకే జీవితంలో ఎదగాలంటే మంచి బుద్ధి కుశలతో ఆలోచించి పనులు చేస్తే మనకు ఎదుగుదల అదే వస్తుంది. జీవితంలో విజయాలు సాధించడానికి చాణక్యుడు కొన్ని పద్ధతులు వివరించాడు. అవేంటో చూద్దాం.
అపజయానికి భయపడవద్దు. విజయానికి తొలి మెట్టు అపజయమే. ఏదైనా మనం ఎందుకు ఓడిపోయామనే దానిపై దృష్టి సారించి మళ్లీ ఆ తప్పు చేయకుండా విజయం సాధించేందుకు కావాల్సిన మార్గమే అపజయం. అంతే కానీ నాకు సక్సెస్ రావడం లేదని నిట్టూరిస్తే ఏమొస్తుంది. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలుపెడతాం. అలాగే విజయాలు కూడా అంత తేలిగ్గా రావు, కష్టపడి పనిచేస్తేనే విజయం నీ సొంతం అవుతుంది. అప్పుడు నీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. జీవితంపై ఓ అవగాహన కలుగుతుంది.
Also Read: Pawan Kalyan Mala: పవన్ కళ్యాణ్ మాల ఏంటి? ఎలా చేస్తారు? దాని వల్ల ఏంటి ఉపయోగం అంటే?
ఏ విషయంలోనైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి. ప్రశ్నలు అడగకుండా ఏ సందేహం కూడా తీరదు. మన మనసులోనే ఉంచుకునే ప్రశ్నలతో మనకు జవాబులు దొరకవు. సందేహాలు తీర్చుకుంటేనే దానికి తగిన సమాధానాలు నీ వద్ద ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ప్రశ్నలు అడగడానికి వెనుకాడవద్దు. మనకు వచ్చిన అనుమానాన్ని ప్రశ్నలు వేసి తీర్చుకుంటే మనకు సమస్యలు రాకుండా ఉంటాయి. అవే మన విజయానికి మెట్లుగా మారుతాయి. ప్రశ్నించడానికి ముందుండాలి. విజయాన్ని సొంతం చేసుకోవాలి.
అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మన శక్తి సామర్థ్యాలేమిటో ఇక్కడే బయటపడతాయి. మనకు అప్పగించిన బాధ్యతలను మనం సమర్థవంతంగా నెరవేరిస్తే మనపై మంచి భావం కలుగుతుంది. తద్వారా మనం ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఎప్పుడైనా మనకు అవకాశం లభిస్తే దాన్ని వదిలేయకూడదు. చాలెంజింగ్ గా తీసుకుని అందులో మనదైన ముద్ర వేయాలి. మంచిపనితనం ప్రదర్శించి మన పై వారిని సంతృప్తి పరచాలి. దీంతో మనపై అభిమానం ఏర్పడి మనకు విజయాలు సాధించే మార్గంగా నిలుస్తుంది. దీంతో జీవితంలో మనం ఎంతో ఎత్తుకు ఎదిగేందుకు సులువు అవుతుంది.
Also Read:BJP New Parliamentary Board: ప్రశ్నించేవారంతా ఔట్.. బీజేపీకి హోల్ అండ్ సోల్ చక్రవర్తి ఇక మోడీనే..
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Chanakya niti what are the things to follow to grow in life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com