KCR New Party: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 22 ఏళ్ల టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పనున్నారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్(భారతీయ రాష్ట్ర సమితిని)ని స్థాపించాలని ఆయన డిసైడ్ అయ్యారు. కొన్ని నెలలుగా కేసీఆర్ రాష్ట్రాన్ని వదిలేశారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతలు, రైతుల గురించి పట్టించుకోవడం మానేశారు. ఆప్పుడు ఆయన దృష్టంతా దేశ రాజకీయాలపైనే ఉంది. రాష్ట్రంలో ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నా.. ఆసరా లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారంపై దాదాపు మూడు నెలలుగా ఒక్క సమావేశం పెట్టని కేసీఆర్.. శుక్రవారం జాతీయ రాజకీయాలపై సొంత పార్టీ నేతలు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన దాదాపు డిసైడ్ అయ్యారు. రాష్ట్రాన్ని వీడుతున్నట్లు పార్టీ నేతలు, మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. జాతీయ పార్టీ స్థాపనపైనే ఇక దృష్టిపెడతాని చెప్పారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ముహూర్తం ఫిక్స్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీతో జాతీయ రాజకీయాల్లో కొత్త పాత్రకు సిద్దమయ్యారు. అందుకు ముహూర్తం సైతం దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల నుంచే తన వ్యూహాలు అమలు చేయబోతున్నారు. అయితే, సీఎం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారా.. దీనికి కేసీఆర్ వ్యూహం ఏంటి.. ఎలా ముందుడుగు వేయబోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్తో పాటుగా అందరిలోనూ ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
సీఎంగా కేసీఆర్ కంటిన్యూ..
సలహాలు.. సంప్రదింపులతో పక్కా లెక్కలతో నిర్ణయం ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగనున్నారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎంగానే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 19న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరోసారి దీని పైన చర్చించి అందరి ఆమోద యోగ్యంతో నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు.
గులాబీ జెండా.. కారు గుర్తుతోనే..
త్వరలో కేసీఆర్ ప్రకటించబోయే పార్టీ బీఆర్ఎస్ జెండా కూడా గులాబీ జెండానే కొనసాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. గుర్తును కూడా కారే ఉంటుందని పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు పార్టీ ముఖ్య నేతలు ఎన్నికల సంఘంతోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. తెలంగాణలో కలిసి వచ్చిన జెండా, గుర్తుతోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Also Read: Priyanka Chopra : 20 ఏళ్ల క్రితం బికినీలో ప్రియాంకచోప్రా ఎలా ఉందో తెలుసా?
ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తర్వాతే రాష్ట్రపతి ఎన్నికలపై నిర్ణయం..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయాలని దాదాపు నిర్ణయించింది. అయితే అభ్యర్ది విషయంలో ఎన్డీఏ ఏం చేయబోతున్నది.. ఎవరిని ప్రతిపాదించేది తెలిసిన తరువాతనే కేసీఆర్ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలు.. వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పార్లమెంట్ ఎన్నికల వరకు తాను ఏ రకంగా వ్యవహరించాలని.. ఎలా ముందుకు వెళ్లాలి… ఎవరితో కలిసి వెళ్లాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా.. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే.. తన జాతీయ పార్టీ ప్రతిపాదన అంశాన్ని సహచర మంత్రులతో షేర్ చేసుకున్న్రారు.
19న జాతీయ పార్టీ ప్రకటన…
ఈనెల 19వ తేదీన నిర్వహించే పార్టీ కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్పై అధికారిక ప్రకటచ చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నిక నుంచే ఎన్డీఏకు షాక్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నా.. దీని కంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దీర్ఘ కాలిక వ్యూహంతో కేసీఆర్ తన ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో తెలంగాణలో హ్యాట్రిక్ విజయం పైనా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ గెలిచి..ఢిల్లీలోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే, తెలంగాణలో తాము బలోపేతం అవుతున్నామనే మైండ్ గేమ్‌తో బీజేపీ.. కేసీఆర్‌ను తెలంగాణకు పరిమితం చేయాలని భావిస్తోంది. దీంతో..హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ సమావేశాల కంటే ముందుగానే తన జాతీయ అజెండా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. దీంతో.. ఇక, కేసీఆర్ వేసే ప్రతీ అడుగు.. రాజకీయంగా ఆసక్తి కరంగా మారనుంది.
Also Read: Prabhas Marriage: శ్రావణమాసంలో ప్రభాస్ పెళ్లి… అమ్మాయి ఎవరంటే?
Web Title: Bye bye to trs go to brs kcr is leaning towards the establishment of a new party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com