Zomato 10 Minutes Delivery: 10 నిమిషాల్లో ఫుడ్ డెలవరీ అంటూ జొమాటో చేసిన ప్రకటనపై విమర్శల వాన కురుస్తోంది. కనీసం ఇంట్లో మ్యాగీ వండి తినడానికి 10 నిమిషాలు పడుతుంది.కానీ ఎక్కడో హోటల్ నుంచి వండి తీసుకొచ్చి డెలవరీ చేయడానికి కేవలం 10 నిమిషాలు చాలు అన్న జొమాటో ప్రకటన దుమారం రేపింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ సేవల కోసం డెలివరీ భాగస్వామ్యులు కఠినమైన, అసురక్షితమైన వాతావరణంలో పనిచేయాల్సి వస్తుందని ఆరోపణలు వినిపించాయి.
ఈ విమర్శల నేపథ్యంలో జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ మంగళవారం స్పందించారు. ‘ఒక నిర్ధిష్ట సమీప ప్రాంతాల్లో, పాపులర్, ప్రామాణికమైన ఆహార పదార్థాలతో మాత్రమే ఈ 10 నిమిషాల్లో ఫుడ్ అందిస్తామని’ ట్వీట్లు చేశారు. ‘10 నిమిషాల్లో, 30 నిమిషాల్లో డెలివరీ మాదిరిగానే ఈ సేవలు కూడా మా డెలివరీ భాగస్వాములకు ఎలాంటి భద్రత ఉంటుందనేది మీకు చెప్పాలనుకుంటున్నానని.. విమర్శలు చేసే ముందు ఒక్కసారి దీన్ని చదవండి’ అంటూ జొమాటో సీఈవో వివరణ ఇచ్చాడు.
Also Read: Posani Shocking Comments About CM Jagan: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు
ఇక 10 నిమిషాలు, 30 నిమిషాల్లో డెలివరీ సేవల్లో ఆన్ టైం డెలివరీలకు ఆలస్యమైతే ఎలాంటి జరిమానాలు ఉండబోవని.. ప్రత్యేకమైన దగ్గరి లోకేషన్లలో ఈ ఇన్ స్టంట్ డెలివరీలను ప్రారంభించేందుకు ప్రత్యేక ఫుడ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు జొమాటో సీఈవో తెలిపారు. 2 నిమిషాల్లో డిస్ ప్యాచ్ చేయగలిగే ఆహార పదార్థాలకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక డెలివరీ భాగస్వాములకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి వారికి జీవిత బీమాను అందిస్తామని గోయల్ ప్రకటించారు.
10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ కోసం ఫుడ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని.. తద్వారా మ్యాగీ లాంటి ఆహారాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. ఇన్ స్టంట్ డెలివరీలో ‘బ్రెడ్, ఆమ్లెట్, పోహా, కాఫీ, ఛాయ్, బిర్యానీ’లు ఉంటాయని తెలిపారు. జొమాటో ఇన్ స్టంట్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి గురుగ్రామ్ లో 4 ఫుడ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Also Read: Ramarao on Duty: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’
10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ విషయంలో విమర్శల నేపథ్యంలో మ్యాగీ సహా ఇన్ స్టంట్ ఫుడ్స్ ఆ విభాగంలో డెలివరీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Hello twitter, good morning 🙂
I just want to tell you more about how 10-minute delivery works, and how it is as safe for our delivery partners as 30-minute delivery.
This time, please take 2 minutes to read through this (before the outrage) 😀
(1/2) https://t.co/PKKn97NhTf pic.twitter.com/NAfw20K1rF
— Deepinder Goyal (@deepigoyal) March 22, 2022
Recommended Video: