Ghee : ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే మొత్తం కల్తీ అవుతుంది. ఏ వస్తువును కొనాలన్నా సరే ప్రతి ఒక్కరు చాలా భయపడుతున్నారు. కాసుల కక్కుర్తి కోసం చాలా వస్తువులను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇక తెలియకుండానే ప్రజలు ఈ అనారోగ్యకరమైన ఆహరం తీసుకుంటున్నారు. కానీ మిగలిన వారు ఏమైపోయినా సరే తమ జేబులు నిండితే చాలనే కొందరు అనుకుంటున్నారు. ఇక ఈ సమయాన్ని సరిగ్గా వాడుకుంటే వ్యాపారస్థులు మంచి లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా కల్తీలేని వస్తువులను తయారు చేస్తే మంచి పేరుతో సహా లాభాలు కూడా వస్తాయి.
చాలా ఎక్కువ మంది నెయ్యిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నెయ్యి కల్తీ కూడా ఎక్కువగా జరుగుతుంది. కల్తీ లేని నెయ్యి వల్ల మంచి లాభాలు ఆర్జించవచ్చు. చాలా మంది ఇంట్లో కచ్చితంగా ఉంటుంది నెయ్యి. చాలా మందికి నెయ్యి లేకపోతే ముద్ద దిగదు. నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చిన్నారులకు కచ్చితంగా నెయ్యిని తినిపిస్తుంటారు. కనీసం పిల్లలకు పెట్టే నెయ్యి అయినా కల్తీ లేకుండా ఉండాలి కదా. అందుకే ఇలాంటి నెయ్యి లభిస్తే డిమాండ్ కూడ అదే రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ నెయ్యి ఇంట్లో తయారు చేస్తే చాలా మంది తీసుకుంటారు కూడా. అందుకే నెయ్యి తయారీని ప్రారంభించి లాభాలు సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంది. మరి నెయ్యి తయారీకి ఏం కావాలి? ఎలా చేయాలో తెలుసుకుందాం.
నెయ్యి తయారీకి క్రీమ్ సెపరేట్ మిషన్‌ను కొనుగోలు చేయాలి. ఈ మిషిన్స్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లభిస్తుంది. వీటిలో రెండు రకాలు ఉంటాయి. హ్యాండ్ ఆపరేటింగ్, మోటర్ మిషిన్స్. ఆన్‌లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. మరి దీనికి తయారీ కావాల్సిన మరో ప్రధాన రా మెటీరియల్ పాలు. అయితే ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉండే పాలను కొనుగోలు చేయాలి. అందుకే డైరెక్ట్ గా పాల కేంద్రాలను లేదా నేరుగా పాడి రైతుల నుంచి పాలను తీసుకోవాలి.
తయారీ విధానం:
క్రీమ్ సెపరేట్ మిషిన్‌లో పాలను పోయాలి. మిషిన్ ఆన్ చేసిన వెంటనే ఒకవైపు నుంచి పాలు, మరో వైపు నుంచి క్రీమ్ వచ్చేస్తుంటుంది. ఈ క్రీమ్‌తోనే నెయ్యిని తయారు చేసుకోవచ్చు. పాల నుంచి సేకరించిన క్రీమును వేడి చేయడం వల్ల కావాల్సిన నెయ్యి వస్తుంది. దీన్ని మీరు స్వయంగా ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి అమ్మవచ్చు. క్రీము తీసిన పాలను డైరెక్టుగా టీ దుకాణాల్లో కూడా అమ్మవచ్చు.
ఒక కేజీ నెయ్యిని తయారు చేయడానికి సుమారు 20 లీటర్ల పాలు కావాలి. ఉదాహరణకు 100 లీటర్ల పాలు కొనుగోల చేస్తే 5 కిలోల నెయ్యి తయారు అవుతుంది. అలాగే 80 లీటర్ల పాలు బయటకు బయటకు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నెయ్యి ధర సుమారు రూ. 600 ఉంది. అంటే 100 లీటర్ల పాలతో తయారు చేసిన నెయ్యితో రూ. 3000 లాభం వస్తుంది.ఇక మిగిలిన పాలను కనీసం లీటరకు రూ. 40 చొప్పున అమ్మినా రూ. 3200 వరకు వస్తాయి. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో సరాసరి రూ. 6000 లాభం పొందే అవకాశం ఉంటుంది.