Post Office:  ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో ప్రతి నెలా రూ.550 పొందవచ్చు.. ఎలా అంటే?

Post Office:  రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. అయితే పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఇతర పెట్టుబడి స్కీమ్స్ తో పోలిస్తే మంచి రాబడిని మాత్రం పొందడం సాధ్యం కాదనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ ప్రతి నెలా మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ […]

Written By: Navya, Updated On : January 16, 2022 9:31 am
Follow us on

Post Office:  రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. అయితే పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఇతర పెట్టుబడి స్కీమ్స్ తో పోలిస్తే మంచి రాబడిని మాత్రం పొందడం సాధ్యం కాదనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ ప్రతి నెలా మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి.

ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గడువు ఐదు సంవత్సరాలు కాగా అవసరమైతే ఈ స్కీమ్ గడువును మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి నెలా 550 రూపాయల చొప్పున వడ్డీని పొందే అవకాశం ఉంటుంది.

కనీసం 1,000 రూపాయలతో ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్స్ ను ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్కీమ్ లో సింగిల్ అకౌంట్ ద్వారా ఏకంగా నాలుగున్నర లక్షలు, జాయింట్ అకౌంట్ ద్వారా 9 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన డబ్బులను సంవత్సరం వ్యవధిలో వెనక్కు తీసుకునే ఛాన్స్ అయితే ఉండదని గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందు విత్ డ్రా చేసుకుంటే ఒక శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.