Homeబిజినెస్Best small investment businesses: ఏడాది పొడవునా లాభాలు ఉండే వ్యాపారాలు ఇవే.. పెట్టుబడి కూడా...

Best small investment businesses: ఏడాది పొడవునా లాభాలు ఉండే వ్యాపారాలు ఇవే.. పెట్టుబడి కూడా చాలా తక్కువే..

Best small investment businesses: ఒక వస్తువును లాభం ఉద్దేశంతో ఇతరుల కు విక్రయించి దాని ద్వారా డబ్బులు పొందేందుకు చేసే పనిని వ్యాపారం అని అంటారు. వ్యాపారం అనేక రకాలుగా ఉంటుంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. అయితే కొన్ని వ్యాపారాలు లాభం రావచ్చు.. మరికొన్ని వ్యాపారాలు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కొందరు వ్యాపారాన్ని ప్రారంభించి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటారు. మరికొందరు వ్యాపారాన్ని మొదలుపెట్టి దీర్ఘకాలంగా లాభాల కోసం ఎదురుచూస్తారు. అయితే కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తే ఏడాది పొడవునా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాపారాల్లో నిత్యవసర వస్తువులు, వినియోగదారుల సేవలు వంటివి ఉంటాయి. వారి అవసరాన్ని గుర్తించి వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఏడాది పొడవునా లాభాలు ఉండే ఆ వ్యాపారాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

నిత్యవసర వస్తువులతో పాటు రోజువారి అవసరాలను తీర్చే సరుకులు అందుబాటులో ఉంచే కిరాణం షాపు ఏడాది పొడవునా లాభాలు ఉంటాయి. ఈ కిరాణం షాపును అవసరమైన చోట ప్రారంభిస్తే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని నివాస ప్రాంతాలు, అపార్ట్మెంట్ల దగ్గర, గ్రామాల్లోని వీధుల్లో ఏర్పాటు చేస్తే కచ్చితంగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. వీటితోపాటు ఉదయం అల్పాహారం అందించే టిఫిన్ సెంటర్ కూడా ఎప్పటికీ లాభం ఉండే అవకాశం ఉంది. చాలామంది ఉదయం వివిధ పనుల్లోకి వెళ్లేవారు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. టిఫిన్ సెంటర్లోకి వెళ్లి రెడీమేడ్ గా ఉన్న ఆల్ఫా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ టిఫిన్ సెంటర్లను బస్టాండ్ దగ్గర, కళాశాలలో, ఎక్కువగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రారంభిస్తే లాభాలు ఉండే అవకాశం ఉంటుంది.

ప్రత్యేక సీజన్ అంటూ లేకుండా ఎప్పటికీ లాభాలు వచ్చే వ్యాపారం మెడికల్ షాప్ పెట్టుకోవడం. ఆస్పత్రిలో దగ్గర, క్లినిక్స్ వద్ద, సిటీ మధ్యలో మెడికల్ షాప్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటికీ వీటికి రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కచ్చితంగా ఉంటుంది. వీటికి సమస్య వస్తే ఎవరికి వారు చేసుకునే అవకాశం ఉండదు. అందువల్ల మొబైల్ రిపేర్ లేదా యాక్సెసరీస్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే వీటికి ఏడాది పొడవునా వ్యాపారం ఉంటుంది. అలాగే మొబైల్ కు సంబంధించిన చార్జర్లు, కవర్లు, రిపేర్ కోసం ఎప్పుడూ కస్టమర్లు వస్తూనే ఉంటారు. మార్కెట్ ఏరియా లేదా కళాశాల ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తే ఎప్పటికీ లాభాలు ఉండే అవకాశం ఉంటుంది.

పాలు లేదా పెరుగు కు సంబంధించిన వ్యాపారం ప్రారంభించిన కూడా ఏడాది పొడవునా లాభాలు ఉంటాయి. ఇవి ప్రతిరోజులో భాగం అయినందున కచ్చితంగా రెగ్యులర్ కస్టమర్లు కూడా ఉంటారు. వీటితోపాటు పాల ఉత్పత్తులను కూడా విక్రయించడం వల్ల అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిని రెసిడెన్షియల్ కళాశాలలో, గ్రామీణ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular