Yamaha Xsr 155: మన దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇప్పటికి హీరో కంపెనీ నెంబర్ వన్ గా ఉంది. హోండా, టీవీఎస్ తదుపరి స్థానంలో ఉన్నాయి. గతంలో మహీంద్రా ఈ సెగ్మెంట్లోకి వచ్చింది కానీ.. ఆ తర్వాత ఎందుకనో వెనక్కి వెళ్ళిపోయింది. యమహా కంపెనీ కూడా ఎప్పటినుంచో ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఉన్నప్పటికీ.. ఎందుకనో తన మార్కు చూపించలేకపోయింది.
ద్విచక్ర వాహనాలకు అంతకంతకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ సెగ్మెంట్లో అమీతుమీ తేల్చుకోవాలని యమహా సిద్ధమైంది. ప్రీమియం మోడల్స్ తయారీలో యమహాకు తిరుగులేదు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్లను ఆకట్టుకోవడంలో మాత్రం యమహా మొదటి నుంచి కూడా విఫలమవుతూనే ఉంది. అయితే ఇన్నాళ్లకు ఈ సమస్యను గుర్తించిన యమహా ఒక్కసారిగా తన రూట్ మార్చింది. 2026 లో X SR 155 అనే మోడల్ ను తెరపైకి తీసుకురానుంది.
ఈ మోడల్ లో యమహా కంపెనీ రెట్రో డిజైన్ ను రూపొందించింది. తన ఫాస్టర్ తత్వాన్ని కొనసాగిస్తూనే.. గుండ్రని ఎల్ఈడి హెడ్ లాంప్, అద్భుతమైన ఇంధన ట్యాంకర్, మినిమలిస్ట్ టైల్ సెక్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిస్క్ బ్రేకులు, వెడల్పైన చాసిస్, తేలికైన ఇంజన్ నిర్మాణం వంటి వాటితో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది యమహా.
ఈ మోడల్ లో ప్రీమియం స్టైలింగ్ అదరగొడుతోంది. కాంపోనెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ మోడల్ ను మల్టీ కలర్స్ లో యమహా అందిస్తోంది. మారుమూల దారుల నుంచి మొదలుపెడితే హైవేల వరకు హాయిగా ఆస్వాదిస్తూ రైడ్ చేయవచ్చని యమహా కంపెనీ చెబుతోంది. శుద్ధి చేసిన ఇంజన్, సౌకర్యవంతమైన ఏర్గోనామిక్స్, ప్రీమియం 150 సిసి సామర్థ్యం.. ఈ మోడల్ ను కొనుగోలుదారుల మదిలో చిరస్థాయిలో నిలబెడతాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. దీని ధర 65,999 గా యమహా కంపెనీ నిర్ణయించింది. ఇతర పన్నులు కలిపితే ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది.