Yamaha FZ-S Fi 2025 : బైక్‌ల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యామహా, తాజాగా తన పాపులర్ మోడల్ FZ-S Fiని ఇంజన్‌లో మార్పులతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ బైక్‌కు కొత్త కలర్ ఆఫ్షన్స్ కూడా యాడ్ చేసింది. 2025 యామహా FZ-S Fiలో ప్రధానంగా గ్రాఫిక్స్, రంగుల్లో మార్పులు చేశారు. ఇది కొత్త డిజైన్ గ్రాఫిక్స్‌తో పాటు బ్లాక్, గ్రే అనే రెండు కొత్త రంగుల్లో లభిస్తుంది. ఇండికేటర్లను ట్యాంక్ కౌల్‌లో అమర్చారు. ఇది ముందు భాగానికి మరింత అందమైన రూపాన్ని ఇస్తుంది.
Also Read : అట్లర్ ప్లాప్ గా హీరో స్ప్లెండర్, హోండా యాక్టీవా.. ఎలా అంటే ?
అప్‌డేట్ చేసిన యామహా FZ-S Fi డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఇది ముందులానే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్, రెండు టైర్లకు డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కొనసాగించారు.
పోటీ ఇచ్చే బైక్‌లు
ఇంజిన్‌ను ఇప్పుడు OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. కానీ, దాని పనితీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ బైక్‌లో ఇప్పటికీ అదే 149cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది 12.2bhp పవర్, 13.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌ను ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ సెగ్మెంట్‌లో యామహా FZ-S Fi బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచె RTR 160, హోండా యూనికార్న్‌తో పాటు ఇతర బైక్‌లకు పోటీ ఇస్తుంది.
ధర ఎంతంటే
అప్‌డేట్ చేసిన యామహా FZ-S Fi ధర పాత మోడల్ కంటే రూ.3,600 ఎక్కువ. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.35 లక్షల నుండి ప్రారంభమవుతుంది. FZ యామహా అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ సిరీస్‌లలో ఒకటి. దీని మొత్తం 5 FZ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి, వీటి ధర రూ.1,17,842 (సగటు ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో చౌకైన మోడల్ యామహా FZ FI. అత్యంత ఖరీదైన మోడల్ యామహా FZ S హైబ్రిడ్, ఇది కూడా 149cc ఇంజన్‌ను కలిగి ఉంది. 12.2 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.
Also Read : హైబ్రిడ్ మోటార్ సైకిల్ అంటే ఏంటి.. యమహా FZ-S Fi ఫీచర్స్, ధర పూర్తి వివరాలివే