Xiaomi Summer Sale India 2026: ప్రముఖ చైనా కంపెనీ Xiaomi వేసవికాలం సందర్భంగా కొత్త ఆఫర్లను అందుబాటులో ఉంచింది.. ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ పరికరాలను తగ్గింపు ధరలతో విక్రయించాలని నిర్ణయించింది. వీటిలో ఫ్యాన్లు, మొబైల్స్, స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి. వినియోగదారులను పెంచుకునే లక్ష్యంగా చేసే ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కంపెనీకి చెందిన మొబైల్ కూడా ఇప్పుడు తక్కువ ధరలోని కొనుగోలు చేయవచ్చును. అలాంటి వాటిలో షియోమీ 17, సియోమి 17 అల్ట్రా వంటి మొబైల్స్ ఉన్నాయి. అలాగే దీని సబ్ కంపెనీ అయినా రెడ్మీ నోట్ కు సంబంధించిన 15 సిరీస్ మొబైల్ కూడా తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు. వాటి వివరాల్లోకి వెళితే..
వేసవి సందర్భంగా షియోమీ ఫ్యాన్ ఫెస్టివల్ ను ఏప్రిల్ 6న ప్రారంభించింది. ఈనెల 15 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా షియోమీ 17 మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో రూ.99,999 గా ఉంటే దీనిని ఇప్పుడు రూ.89,999 తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ 12gb రామ్, 512జీబి స్టోరేజ్ మొబైల్ కు వర్తిస్తుంది. అలాగే షియోమీ 17 అల్ట్రా 16జిబి రామ్, 512 జిబి స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.1,69,999 తో విక్రయిస్తున్నారు. దీనిని ఆఫర్ కింద రూ.1,29,999 కే కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు రెడ్ మీ 15 మొబైల్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.19,999 ఉండగా దీనిని రూ.16,499 కే కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ నోట్ 15 మొబైల్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.33,999 ఉండగా.. దీనిని రూ.26,999 కె కొనుగోలు చేయవచ్చు.
ఇలా మొబైల్స్ మాత్రమే కాకుండా సియోమి స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా షియోమీ స్మార్ట్ టీవీ ఏ 32 2025 మోడల్ 32 అంగుళాలు అయితే ప్రస్తుతం రూ.12,999 గా ఉంది. దీనిని రూ.11,999 తో కొనుగోలు చేయవచ్చు. అలాగే షియోమీ QLED టీవీ ఎక్స్ ప్రో 65 అంగుళాల ధర రూ.54,999 ఉండగా దీనిని రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చును.
వీటితోపాటు టాబ్లెట్స్ పై కూడా షియోమీ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రెడ్మి ప్యాడ్ 2 ధర రూ.17,999 ఉండగా దీనిని ఆఫర్ కింద రూ.16,999 తో కొనుగోలు చేయవచ్చు. అలాగే షియోమీ ప్యాడ్ 8 ధరా ప్రస్తుతం మార్కెట్లో రూ.33,999 ఉండగా.32,999 తో విక్రయిస్తున్నారు. మొత్తంగా చూస్తే కొన్ని డివైస్ లపై రూ.1000 నుంచి రూ.3000 వరకు తగ్గింపును పొందవచ్చు. వినియోగదారులను ఆకర్షించేందుకే ఈ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.