Xiaomi SU7 sedan features: ఫ్యూయల్ తో నడిచే వాహనాలకు భవిష్యత్తు కాలంలో ఏదైనా ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇప్పుడు గల్ఫ్ మాదిరిగా యుద్ధాలు జరిగితే భవిష్యత్తు కాలంలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకుండా పోతే.. అప్పుడు ఆ వాహనాలు ఉండి కూడా ఉపయోగం ఉండదు. అందువల్లే కొంతకాలంగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ, వాడకం పెరిగిపోయింది. పెద్ద పెద్ద సంస్థలు కూడా ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.
మొదట్లో ఎలక్ట్రానిక్ వాహనాలు ఒక పరిధి వరకే పనిచేసేవి. అయితే ఇప్పుడు కంపెనీలు బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచడం.. ఫీచర్లను అప్డేట్ చేయడంతో ఎలక్ట్రానిక్ వాహనాలు వినియోగదారుల మనసును చూరగొంటున్నాయి. ఈ జాబితాలో షియోమీ కంపెనీ గేమ్ చేంజర్ లాంటి మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
చైనా దేశానికి చెందిన షియోమీ అనే కంపెనీ ఎస్ యూ 7 సెడాన్ పేరుతో ఒక మోడల్ కారును మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్.. డ్రైవర్ అసిస్టెన్స్ హార్డ్వేర్.. క్యాబ్ ఇన్ ఫీచర్లు.. శాసిస్ సెటప్.. ఇలా చాలా మార్పులు తీసుకొచ్చింది. దీని ధర ఇండియన్ మార్కెట్లో 29.79 లక్షల వరకు పలుకుతోంది.
Also Read: ఒక్కో ఫీచర్ చూస్తే మతిపోతుంది.. ఇది కారు కాదు? రోడ్డు మీద హంస వాహనం!
ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ విధానంలో పనిచేస్తూ ఉంటుంది. 73 kwh, 96.3 kwh lep ప్యాక్, 101.7 kwh ternary lithium బ్యాటరీ ఇందులో ఉంది. వెర్షన్ ఆధారంగా cltc స్థాయి 720, 902, 835 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.. ఈ కారు రోడ్డు మీద పరుగులు తీస్తున్నప్పుడు 752 వీ నుంచి 897వీ పరిధిలో హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ సిస్టం ను ఉపయోగిస్తుంది.
ఇందులో ఇంటీరియర్ చాలా గ్రాండియర్ గా ఉంది. లోపలి భాగంలో అప్డేటెడ్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్ఫేస్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. 16.1 అంగుళాల సెంట్రల్ డిస్ప్లే.. 7.1 అంగుళాల రొటేటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.. హెడ్ అప్ డిస్ప్లే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వాయిస్ కంట్రోల్.. మల్టీ స్క్రీన్ ఇంటరాక్షన్ ఇందులో అదనపు ఫీచర్లు. ఇవన్నీ కూడా షియోమీ కాక్ పిట్ సిస్టమ్ కు అనుసంధానమై ఉంటాయి.