Homeబిజినెస్Xiaomi Redmi Note 15 Pro: ప్రీమియం ఫీచర్లు.. లో బడ్జెట్ కలిగిన ఫోన్ ఇదే..

Xiaomi Redmi Note 15 Pro: ప్రీమియం ఫీచర్లు.. లో బడ్జెట్ కలిగిన ఫోన్ ఇదే..

Xiaomi Redmi Note 15 Pro: చైనాకు చెందిన Xiaomi కంపెనీ రకరకాల మొబైల్స్ ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తుంది. దీనినుంచి వచ్చిన మొబైల్స్ లో రెడ్ మి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లను, ఇతర పరికరాలను మారుస్తూ రెడ్ మి నోట్ 15 ప్రో మొబైల్ ను జనవరి 29వ తేదీన మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కంపెనీ చాలా విషయాలు పేర్కొంది. ముఖ్యంగా ఇందులో కెమెరా AI తరహాలో పనిచేస్తుందని తెలిపింది. అలాగే ఇందులో ఉండే బ్యాటరీ కూడా సమర్థవంతంగా ఉంటుందని పేర్కొంటుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Xiaomi Redmi Note 15 Pro కెమెరా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది వినియోగదారుల రోజువారి అవసరాలతో పాటు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఆల్ట్రా వైడ్ సెన్సార్ పిక్చర్స్ కూడా తీసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. అలాగే సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ మొబైల్లో బ్యాటరీ పర్ఫామెన్స్ తక్కువ ఏం కాదని అంటున్నారు. ఎందుకంటే ఇందులో 6500 mAh బ్యాటరీ చేర్చారు. ఇది సిలికాన్ +కార్బన్ కావడంతో మూడు సంవత్సరాల వరకు బ్యాటరీ ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ బ్యాటరీ 100W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో పనిచేస్తుంది. అలాగే 22.5 రివర్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది.

అలాగే ఇందులో ఉండే డిస్ప్లే తో పాటు డిజైన్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండడంతో దీనిని కొనేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.ఈ మొబైల్లో 6.83 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 3200 నిట్స్ బ్రైట్నెస్ లో పనిచేస్తుంది. అలాగే ఈ మొబైల్ పై గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉండడంతో మొబైల్ పై ఎలాంటి మరకలు పడిన వెంటనే తొలగిపోయే అవకాశం ఉంటుంది.

నేటి వినియోగదారులకు అనుగుణంగా ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సాఫ్ట్వేర్ను చేర్చారు. స్నాప్ డ్రాగ 7S Gen 4 చిప్సెట్ తో 7400 ఆల్ట్రా ప్రాసెసర్ తో పనిచేస్తుంది. నీతో మొబైల్ వేగం ఏ మాత్రం తగ్గకుండా యూత్ కు అనుగుణంగా.. గేమింగ్ కోరుకునే వారికి మద్దతుగా పనిచేస్తుంది. అలాగే ఇందులో కావలసిన స్టోరేజ్ ఉండడంతో ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని మార్కెట్లో రూ.29,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ ధరలో 8gb రామ్ తో పాటు 128 జీబీ స్టోరీస్ రానుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular