Homeబిజినెస్Xiaomi: యూజర్లకు Xiaomi అదిరిపోయే గిఫ్ట్! ఇది అసలు ఊహించలేదు!

Xiaomi: యూజర్లకు Xiaomi అదిరిపోయే గిఫ్ట్! ఇది అసలు ఊహించలేదు!

Xiaomi: స్మార్ట్ ఫోన్ కాలంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. నిన్నటి టెక్నాలజీ నేటికి పనికిరాదు. నేటి ఫీచర్లు రేపటికి ఉపయోగపడవు. ఇప్పటి కాలంలో మనిషి అవసరాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. టెక్నాలజీ మీద విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. అందువల్ల సదుపాయాల కోసం.. ఇతర రకాల ఫీచర్ల కోసం కంపెనీలు కొత్త కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

స్మార్ట్ యుగంలో ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అనేక రకాల కంపెనీలు రకరకాల ఫోన్లను తయారు చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా యూజర్లను ఆకట్టుకునే విషయంలో xiaomi కంపెనీ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ భారత దేశంలో విపరీతంగా అమ్మకాలు చేపడుతుంది. బడ్జెట్ నుంచి మొదలుపెడితే ప్రీమియం వరకు ప్రతి వేరియెంట్ లోనూ దుమ్ము రేపే రేంజ్ లో అమ్మకాలు సాగిస్తోంది.

అమ్మకాలు సాగించడం మాత్రమే కాదు.. తన స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన అప్డేట్లు అందించే విషయంలో కూడా ఈ కంపెనీ ముందు వరుసలో ఉంది. 2026 సంవత్సరంలో ఈ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సంస్థ విక్రయించే ఫోన్లకు ఐదు సంవత్సరాల వరకు hyper OS అప్డేట్స్ అందిస్తామని వెల్లడించింది. Xiaomi సంస్థ తయారు చేసే ఫోన్లలో redmi, POCO బ్రాండ్లు విశేషమైన ప్రాచుర్యాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ పరికరాలకు ఆండ్రాయిడ్/ హైపర్ ఓ ఎస్ అప్డేట్లు xiaomi అందించనుంది. ఇలా అప్డేట్లు అందించడం ద్వారా ఈ ఉత్పత్తులను యూజర్లు విశేషంగా వాడతారని xiaomi కంపెనీ చెబుతోంది. తన ఫ్లాగ్ షిప్ పరికరాలకు నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్/ హైపర్ ఓ ఎస్ అప్డేట్లు, ఆరు సంవత్సరాల ఉపయకరమైన భద్రత మద్దతును అందిస్తామని xiaomi చెబుతోంది.. ఇదే సమయంలో redmi ఫోన్లు రెండు సంవత్సరాలు పాటు ప్రధాన ఆండ్రాయిడ్ లేదా హైపర్ ఓ ఎస్ అప్డేట్లతో మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ రోల్ అవుట్ సపోర్ట్ పొందుతాయి.

Poco ఫోన్లు కూడా దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల భారీ ఓ ఎస్ అప్ గ్రేడ్ పొందుతాయి. Xiaomi ఎంపిక చేసిన పరికరాల విషయంలో ఐదు సంవత్సరాల హైపర్ ఓ ఎస్ అప్డేట్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

Xiaomi ఇచ్చే అప్డేట్ల పరిమితి ఎలా ఉందంటే

Redmi pad 2: రెండు సంవత్సరాల ఏడు నెలలు (2032 వరకు)

Redmi pad 2 4G: ఆరు సంవత్సరాల ఆరు నెలలు (2032 వరకు)

POCO FB ultra/pro: ఐదు సంవత్సరాల 10 నెలలు (2031 వరకు)

Redmi 15c 5G: ఐదు సంవత్సరాల 8 నెలలు (2031 వరకు)

Xiaomi 15t/ pro: ఐదు సంవత్సరాల 8 నెలలు (2031 వరకు)

Redmi 15: ఐదు సంవత్సరాల 8 నెలలు (2031 వరకు)

Poco c85/redmi 15c: ఐదు సంవత్సరాల ఏడు నెలలు (2031 వరకు)

Poco m7: ఐదు సంవత్సరాల ఏడు నెలలు (2031 వరకు)

Redmi 15 5G: ఐదు సంవత్సరాల ఏడు నెలలు (2031 వరకు)

Poco f7: ఐదు సంవత్సరాల ఐదు నెలలు (2031 వరకు)

Poco f7 Pro/ ultra: ఐదు సంవత్సరాల రెండు నెలలు (2031 వరకు)

Xiaomi pad 7: ఐదు సంవత్సరాల రెండు నెలలు (2031 వరకు)

Xiaomi 15 ultra: ఐదు సంవత్సరాల రెండు నెలలు (2031 వరకు)

Redmi note 14: ఐదు సంవత్సరాల రెండు నెలలు (2031 వరకు)

Redmi pad 2 pro/ 5G: మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు (2029 వరకు)

POCO pad M1: మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు (2029 వరకు)

Xiaomi 14T/ pro: మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు (2029 వరకు)

Redmi 14 C: రెండు సంవత్సరాల 8 నెలలు (2028 వరకు).. ఇక ఇవే కాకుండా.. POCO C75, xiaomi MIX, redmi A5, xiaomi pad 7 Pro, xiaomi 14 ultra, poco m7 Pro, xiaomi 13T/ pro, xiaomi 13 ultra/ pro, redmi Note 13 series, xiaomi 13 lite, redmi 12, xiaomi 12t/ pro, xiaomi 12/ pro, redmi note 12 5G, redmi 12 c వంటి మోడల్స్ పై కూడా అప్డేట్ అందిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version