Xiaomi 17T Vs Vivo V70 Elite: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో Xiaomi ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఉంటుంది. కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా Xiaomi 17T, Vivo V70 Elite మోడల్స్ ఇటీవలి ధరల పెరుగుదల తర్వాత సరికొత్త చర్చకు దారితీశాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ రెండు ఫోన్లలో ఏది వినియోగదారులకు బెస్ట్? అనే చర్చ సాగుతోంది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు, పనితీరు ఎలా ఉందో చూద్దాం.
ఇటీవల ధరలు పెరిగిన తరువాత వివో తన Vivo V70 Elite బేస్ వేరియంట్ (8GB + 256GB) ధరను రూ. 54,999 నుండి ఏకంగా రూ. 58,999 కి పెంచింది. అలాగే దీని 12GB + 256GB వేరియంట్ ధర రూ. 63,999 కి చేరింది. మరోవైపు ఈ ఫోన్ కు గట్టి పోటీగా నిలిచిన Xiaomi 17T (12GB + 256GB) వేరియంట్ ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ. 59,999 ధరతో లభిస్తోంది. ధరల పెరుగుదల తర్వాత ఈ రెండు ఫోన్లు కూడా రూ. 60,000 బడ్జెట్ శ్రేణిలో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి.
డిస్‌ప్లే పరంగా చూస్తే.. రెండు ఫోన్లు ఒకే డిస్ ప్లే 6.59 అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇవి సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. అయితే షియోమి 17T స్క్రీన్ 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుండగా.. వివో V70 ఎలైట్ కర్వ్డ్ ఎడ్జ్ డిజైన్ ఏకంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా వివో 194 గ్రాములతో కాస్త స్లిమ్‌గా ఉంటే, షియోమి 200 గ్రాముల బరువుతో క్లాసిక్ ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది.
పనితీరు విషయంలోనూ… రెండింటిలో శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లను వాడారు. Xiaomi 17Tలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉండనుంది. దీంతో ఇది గేమింగ్ ప్రియులకు అద్భుతమైన ఎంపిక అని భావిస్తున్నారు. అలాగే Vivo V70 Elite మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. రా పర్ఫార్మెన్స్ పరంగా షియోమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, డే-టు-డే టాస్క్‌లు, పవర్ ఎఫిషియెన్సీలో స్నాప్‌డ్రాగన్ చాలా స్థిరంగా పనిచేస్తుంది.
ఈ రెండు ఫోన్లలో కెమెరా పనితీరు వేర్వేగా ఉన్నాయి. Xiaomi 17T లో ప్రసిద్ధ 50MP ప్రాథమిక కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో , మరియు 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. దూరంగా ఉన్న వస్తువులను జూమ్ చేయడానికి ఇది బెస్ట్. Vivo V70 Elite లో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇది సెల్ఫీల విషయానికి వస్తే వివో 50MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో షియోమి మెరుగైన ఫోటోలను అందిస్తుంది.
బ్యాటరీ విభాగంలో రెండింటిలోనూ భారీ 6500 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీలను అందించారు. అయితే బ్యాటరీ లైఫ్ ఆప్టిమైజేషన్ పరంగా వివో కాస్త ఎక్కువ స్క్రీన్-ఆన్ టైమ్ ఇస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఛార్జింగ్ వేగంలో మాత్రం Vivo V70 Elite 90W ఫ్లాష్‌ఛార్జ్‌తో ముందుండగా.. Xiaomi 17T కేవలం 67W టర్బో ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఈ రెండు ఫోన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో కెమెరా పనితీరు కోసం ఆలోచించేవారు Xiaomi 17T సరైన ఎంపిక అవుతుంది. ప్రీమియం కర్వ్డ్ డిజైన్, అదిరిపోయే సెల్ఫీ కెమెరా కోసం Vivo V70 Elite కొనడం బెటర్ అని టెక్ నిపుణులు అంటున్నారు.
