Xiaomi 17 Pro Max: ఒకప్పుడు మంచి ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా కెమెరాను కొనుగోలు చేసేవారు. కానీ మొబైల్స్ లోనే ఇప్పుడు అద్భుతమైన కెమెరాను అందిస్తున్నారు. దీంతో కాలింగ్, మెసేజ్ తో పాటు ప్రొఫెషనల్ గా ఫోటోగ్రఫీగా కొనసాగే వారు సైతం కెమెరా ప్రధానంగా ఉండే మొబైల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కేవలం కెమెరాలు ప్రత్యేకంగా అందించే Xiaomi కంపెనీ లేటెస్ట్ గా ఒక మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా కెమెరా విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉండడంతో నేటి తరం వారికి అనుగుణంగా ఉండనుంది. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Xiaomi 17 Pro Max అనే కొత్త మొబైల్ కెమెరా గురించి ఇటీవల ఆన్లైన్లో సమాచారం ఇచ్చారు. ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా పనిచేయనుంది. టెలిఫోటో కోసం మరో 50 MP కెమెరా పనిచేస్తుంది. ఈ కెమెరాల ద్వారా ఫొటోస్ స్పష్టంగా చిత్రీకరించబడుతుంది. ఆపిల్ మొబైల్స్ లో ఉండే ఫ్లాగ్ ఫిష్ లా ఉండకపోయినప్పటికీ అంతే స్థాయిలో జూమ్ లోను ఎలాంటి నాణ్యత తగ్గకుండా ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. స్థిరమైన ఎక్స్పోజర్, ఆహ్లాదకరమైన టెక్చర్ అందించే ఈ కెమెరా ఆపిల్ ఫోన్లకు పోటీని ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే దీని ద్వారా వీడియో చిత్రీకరించినా 4k resolution తో వచ్చే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీని ప్రత్యేకంగా వృత్తి ఎంచుకున్న వారికి ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
అలాగే ఇందులో మిగతా ఫీచర్లు కూడా అద్భుతం అని అంటున్నారు.Xiaomi 17 Pro Max మొబైల్లో 6.9 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 120 Hz రిప్రెష్ రేట్ తో పనిచేస్తుంది. వీడియో గేమింగ్ తో పాటు నెట్ ఫ్లిక్ వంటి మూవీస్ చూడడానికి ఈ మొబైల్ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.. అలాగే స్మూత్ స్క్రోలింగ్ ఉండడంతో యూత్ కు బాగా నచ్చుతుంది. ఇందులో బలమైన బ్యాటరీని చేర్చారు.7599 mAh బ్యాటరీ ఉండడంతో రోజువారి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్ చేస్తుంది. దీంతో బిజీగా ఉండేవారు ఇలాంటి సమయాన్ని వృథా చేసుకోకుండా మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ కూడా నేటి తరం వారికి అనుగుణంగా ఉండనుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండడంతో మొబైల్ వేగం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో 12 జిబి రామ్ తో పాటు 512జిబి స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫైల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. దీనిని మార్కెట్లో రూ.1,10,000 లతో విక్రయిస్తున్నారు.