Union Budget : ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు తగ్గుతాయోచ్?

Union Budget : మనదేశంలో ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసి ఏప్రిల్ 1 నుంచి ఆరంభం అవుతుంది. దీంతో వస్తువుల ధరల్లో పెరుగుదల సామాన్యంగానే కనిపిస్తుంది. దేశ ఆర్థిక బడ్జెట్ కూడా ఇప్పుడే అమల్లోకి వస్తుంది. సామాన్యుడిపై భారం మోపేందుకు ప్రభుత్వాలు పన్నులు వేస్తుంటాయి. దీంతో మనం సంపాదించే దాంట్లో పన్నులకే ఎక్కువ భాగం పోతుంది. ఈనేపథ్యంలో మన సంపాదన అంతా అమ్మగారి పసుపుకుంకాలకే అన్నట్లుగా మన జీవిత గమనం మారుతుంది. దీంతో ఏం చేయాలన్నా కుదరదు. మన […]

Written By: Srinivas, Updated On : March 30, 2023 4:25 pm
Follow us on


Union Budget
 : మనదేశంలో ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసి ఏప్రిల్ 1 నుంచి ఆరంభం అవుతుంది. దీంతో వస్తువుల ధరల్లో పెరుగుదల సామాన్యంగానే కనిపిస్తుంది.
దేశ ఆర్థిక బడ్జెట్ కూడా ఇప్పుడే అమల్లోకి వస్తుంది. సామాన్యుడిపై భారం మోపేందుకు ప్రభుత్వాలు పన్నులు వేస్తుంటాయి. దీంతో మనం సంపాదించే దాంట్లో పన్నులకే ఎక్కువ భాగం పోతుంది. ఈనేపథ్యంలో మన సంపాదన అంతా అమ్మగారి పసుపుకుంకాలకే అన్నట్లుగా మన జీవిత గమనం మారుతుంది. దీంతో ఏం చేయాలన్నా కుదరదు. మన సంపాదన పెంచుకుంటేనే మనకు ఆదాయం మిగిలేదు. ఆ సంపాదన పెరిగే మార్గం కూడా కనిపించదు.

ఏప్రిల్ 1 నుంచి..

ఏప్రిల్ 1 నుంచి కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. దీంతో చాలా రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగగ్ించి 2.5 శాతం చేసింది. దీనివల్ల కొన్ని రకాల వస్తువుల ధరలు దిగి వస్తున్నాయి. ఇందులో మొబైల్ ఫోన్లు, కెమెరా, ఎల్ ఈడీ టీవీ, బయో గ్యాస్ వస్తువులు, ఎలక్ర్టిక్ వాహనాలు, ఆట వస్తువులు, హీట్ క్వాయిల్ , డైమెండ్ జువెల్లరీ, సైకిళ్లు ఉండటం గమనార్హం. ఇదే సందర్భంలో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయని చెబుతున్నారు.

పెరిగే వస్తువులు

ఏప్రిల్ 1 నుంచి కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి. బంగారం, వెండితో తయారయ్యే వస్తువులు, ప్లాటినం, ఇంపోర్టెడ్ డోర్స్, కిచెన్ చిమ్మీలు, విదేశీ ఆట వస్తువులు, సిగరేట్, ఎక్స్ రే మిషన్ ధరలు పెరగనున్నాయి. ఈ విషయం ఫిబ్రవరిలోనే ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ప్రకటించడంతో ముందే తెలిసింది. ఈ నేపథ్యంలో పెరిగే వస్తువులతో మధ్యతరగతి వారికి ఇబ్బందులే. వారు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపితే జేబు ఖాళీ కావాల్సిందే.

యూపీఐ సేవలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూపీఐ విధానంతో చెల్లించే వ్యాపార లావాదేవీలపై చార్జీ విధిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ వ్యాపార లావాదేవీలపై చెల్లింపులు పడనున్నాయి. రూ. 2 వేలు దాటిన లావాదేవీలపై 1.1 శాతం వడ్డీ సర్ చార్జీగా వసూలు చేయనుంది. దీని వల్ల ఇక మీదట యూపీఐ సేవలు వినియోగించుకునే వారికి ఇబ్బందులే. ఇక ఎల్పీజీ సిలిండర్ పై కూడా రూ. 50 లు ఇప్పటికే పెరగడంతో ఏప్రిల్ నుంచి మరింత పెరిగే అవకాశాలున్నాయి.