Consumption Of Gold: దేశంలో బంగారం విలువ పడిపోతోందా. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ఎక్కువే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలో బంగారం వినియోగం పెరిగిపోయింది. ఆడవారు మొగుడినైనా పక్కన పెడతారు కాని బంగారాన్ని మాత్రం తన మొగుడికంటే ఎక్కువ ఆరాధించడం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కోసం ప్రజలు వెంపర్లాడటం లేదని తెలుస్తోంది. దీంతోనే కొద్దిరోజులుగా బంగారం కొనుగోలు మందగిస్తోంది. బంగారం నిల్వలు అలాగే ఉండిపోతున్నాయి. ఒకప్పుడు రోజువారి కొనుగోళ్లు చూస్తే ఆశ్చర్యం వేసేది.

ఇప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తోంది. బంగారం కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. దుకాణాలు వెలవెలబోతున్నాయి. బంగారం అంటే బాగా రియాక్ట్ అయ్యే ప్రజలు కొద్ది రోజులుగా కొనుగోళ్లు చేయడం లేదు. ఈ క్రమంలో దేశంలో బంగారం నిల్వలు అలాగే ఉండిపోతున్నాయి. ప్రజలు కొనుగోలు చేస్తేనే వినియోగం పెరిగేది. తద్వారా ఆదాయాలు వచ్చేది. కానీ కొన్ని రోజుల నుంచి బంగారం కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
Also Read: Tirumala Tirupati: తిరుమలలో ఏంటీ అపచారం.. ?
కరోనా ప్రభావంతో లాక్ డౌన్, డాలర్ విలువ పెరగడం వంటి అంశాలు బంగారం కొనుగోలుపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత అందరి ఆదాయాలు తలకిందులయ్యాయి. ఉన్న ఉద్యోగాలు ఎగిరిపోయాయి. పొట్ట చేత పట్టుకుని ఉద్యోగాల కోసం వెతికిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బంగారం కొనుగోలుపై ప్రభావం చూపింది. మరోవైపు డాలర్ విలువ పెరగడం కూడా బంగారం వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపించింది. డాలర్ విలువ అమాంతం పెరగడంతో ద్రవ్యోల్బణం ఏర్పడింది. ఫలితంగా ప్రభుత్వాలు డీలా పడిపోవడం మామూలే.
ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలైపోవడంతో బంగారం వినియోగం తగ్గిపోయింది. దేశంలో రూపాయి విలువ క్షీణించడం, దిగుమతి సుంకం పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో కూడా బంగారం వినియోగంలో ప్రతికూలాన్ని చూపిస్తున్నాయని తెలుస్తోంది. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థల వల్ల కూడా బంగారం వినియోగం తగ్గుతోంది. భవిష్యత్ లో ఇంకా బంగారం వినియోగం తగ్గిపోనుందని సర్వేలు చెబుతున్నాయి.
Also Read: Actress Poorna: ఆ స్టెప్పులేసుడేందీ.. ఆ ఊపుడేంది..? మతిపోగొడుతున్న పూర్ణ.. వైరల్ వీడియో