Auto rickshaw : పేదవాడి కారు అంటే అందరికి గుర్తు వచ్చేది ఆటోనే. సామాన్యులు ఎక్కువగా ఆటోలోనే ఎక్కడికైనా వెళ్తుంటారు. మనకి ఏదైనా పని ఉంటే తక్కువ బడ్జెట్‌లో పూర్తి అయిపోయేది ఏంటంటే ఫస్ట్ గుర్తు వచ్చేది మాత్రం ఆటోనే. దగ్గర అయిన దూరం అయిన కూడా చాలా మంది ఆటోనే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. అయితే మిగతా వాహనాలతో పోలిస్తే..ఆటోకు కేవలం మూడు చక్రాలు మాత్రమే ఉంటాయి. సైకిల్, మోటారుకు రెండు చక్రాలు ఉంటే, కారుకు నాలుగు చక్రాలు ఉంటాయి. కానీ కేవలం ఒక్క ఆటోకు మాత్రమే మూడు చక్రాలు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆటోకు ఎందుకు మూడు చక్రాలు ఉంటాయి? కార్లులా నాలుగు చక్రాలు ఎందుకు ఉండవు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీపై ఓ లుక్కేయండి.
మిగతా వాహనాలతో పోలిస్తే ఆటోను తయారు చేయడం ఈజీ. నాలుగు చక్రాలతో వాహనాన్ని తయారు చేస్తే ఖర్చు ఎక్కువ కావడంతో ఇంజినీరింగ్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే మూడు చక్రాలతో తయారు చేస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే ఇంజినీరింగ్ వర్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుంది. అయితే నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నగా ఉంటుంది. దీంతో ఇరుకు ప్రాంతంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. అలాగే పార్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే కార్లు అయితే కొన్ని ప్రదేశాల్లో పార్క్ చేయలేరు. తక్కువ స్పేస్ ఉంటే పార్క్ చేయడం కష్టం అవుతుంది. అలాగే కార్లు చిన్న వీధుల్లోకి వెళ్లవు. అదే ఆటో అయితే సంధుల్లోకి కూడా అలాగే ఆటో వల్ల ఇంధన వినియోగం కూడా ఎక్కువగా కాదు. తక్కువ ఇంధనం సరిపోతుంది. అదే ఏ ఇతర వాహనాలు అయితే మాత్రం ఇంధనం ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది.
దేశంలో ప్రతీ దగ్గర ఆటోలు ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా ఆటోలను ఎంచుకుంటారు. తక్కువ ఖర్చుతో ఈజీగా అయిపోతుందని భావిస్తారు. నిజానికి ఈ రోజుల్లో చాలా ఆటోలు ఉన్నాయి. చాలా మంది జీవనోపాధి కోసం కారు కొనలేక.. ఆటోలు కొంటున్నారు. కారు అంటే ఎక్కువ లక్షలు ఉండాలి. అదే ఆటో అయితే తక్కువ ఖర్చుతో అవుతుందని భావిస్తున్నారు. సిటీలో ఇంకా ఎక్కువగా కార్లు ఉపయోగిస్తారు. కానీ పల్లెటూరిలో ఎక్కువగా ఆటోలనే ఉపయోగిస్తారు. ఇవైతే తక్కువ ధర ఉండటంతో పాటు కంఫర్ట్ ఉంటాయని భావిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.