Ratan Tata Passed Away: రతన్ టాటా కన్ను మూసిన తర్వాత.. టాటా కంపెనీలను ఆయన సవతి సోదరుడు నోయల్ చూసుకుంటారని జాతీయ మీడియాలో గురువారం ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రతన్ కన్నుమూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోయల్ కు ఫోన్ చేశారు. దీంతో టాటా గ్రూప్ కు కాబోయే చైర్మన్ నోయల్ అని జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. టాటా గ్రూపులో అత్యంత శక్తివంతమైనది టాటా ట్రస్ట్స్ చైర్మన్ పదవి.. టాటా గ్రూప్ లో కంపెనీలను ముందుకు నడిపించడంలో ట్రస్ట్స్ చైర్మన్ కీలక పాత్ర పోషిస్తారు. టాటా సన్స్ లో 66% షేర్లు శ్రీ దోరాబ్జి టాటా, శ్రీ రతన్ టాటా, ఇతర ట్రస్టుల ఆధీనంలో ఉన్నాయి. టాటా గ్రూపులో టాటా సన్స్ 52% వాటా కలిగి ఉంది.. టాటా సన్స్ గ్రూపులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అత్యధిక ఆదాయం తీసుకొచ్చే సంస్థగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం దీని నుంచి ఇప్పటివరకు 43 వేల కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం టాటా సన్స్ కంపెనీకి చంద్రశేఖరన్ చైర్మన్ గా ఉన్నారు. మరోవైపు మిస్త్రి కుటుంబానికి టాటా గ్రూపులో భారీగానే వాటాలు ఉన్నాయి.
అప్పుడే విభజించారు
రతన్ బతికున్నప్పుడు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ గ్రూపులను విభజించారు. ముందుగా టాటా సన్స్ చైర్మన్ గా రతన్ ఉండేవారు.. ఆ తర్వాత ఆయన టాటా ట్రస్ట్స్ వరకే ఆగిపోయారు. ఇక గతంలో స్థానంలో టాటాలకు అత్యంత సమీప బంధువైన సైరస్ మిస్త్రి కొనసాగారు. రథంతో ఏర్పడిన విభేదాల వల్ల ఆయనను కంపెనీ పక్కన పెట్టింది. ఆ తర్వాత చంద్రశేఖరన్ ను సంస్థలోకి రప్పించింది. చంద్రశేఖరన్ టాటా ట్రస్ట్స్ బోర్డులో లేరు. ఇక ఈ ప్రకారం ఈ గ్రూపులో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. బోర్డులో పనిచేసే సభ్యులకు 70 సంవత్సరాల వరకు వెసలు బాటు ఉంటుంది. చంద్రశేఖరన్ ఈ ప్రకారం చూసుకుంటే మరో నాలుగేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. టాటా కంపెనీలకు సంబంధించిన వివిధ ట్రస్టులలో టీవీఎస్ గ్రూప్ అధినేత వేణు శ్రీనివాసన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్, జేఎన్ టాటా, నోయల్ టాటా, జహంగీర్, మెహ్లీ మిస్త్రి, డారిస్ ఖంబాట, నెవిల్లె వంటి వారు ఉన్నారు.
రకరకాల ప్రచారాలు
ప్రస్తుతం టాటా గ్రూపుకు సంబంధించిన అంతర్జాతీయ వ్యవహారాలను నోయల్ చూసుకుంటున్నారు. నోయల్ రతన్ టాటాకు సవతి సోదరుడు. టాటా గ్రూపులో ట్రెంట్, వెస్ట్ సైడ్ అనేవి నోయల్ పర్యవేక్షణలో ఉన్నాయి. 2003లో నోయల్ టైటాన్, వోల్టాస్ బోర్డులలో పనిచేశారు. 2010 నాటికి టాటా ఇంటర్నేషనల్ కు ఆయన డైరెక్టర్ అయ్యారు. 2011లో టాటా సన్స్ కు చైర్మన్ అవుతారని అంచనా వేసినప్పటికీ..మిస్త్రీ రంగంలోకి వచ్చారు. నోయల్ కు శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. 2016లో మిస్త్రీ టాటా గ్రూప్ నుంచి వెళ్లిపోయిన తర్వాత రతన్ మళ్లీ పగ్గాలు దక్కించుకున్నారు. నోయల్ ట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ చైర్మన్, టైటాన్, టాటా స్టీల్ వైస్ చైర్మన్ గా పని చేశారు. నోయల్ కాకుండా మెహర్జీ పల్లోంజి గ్రూప్ డైరెక్టర్ మెహ్లీ మిస్త్రీ పేరు కూడా వినిపిస్తోంది. మెహర్జీ రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయన టాటా గ్రూపులో కీలక పదవులలో పనిచేశారు. మెహర్జీ దివంగత సైరస్ మిస్త్రీ కి బావ వరుస అవుతాడు. మెహర్జీ పల్లోంజి గ్రూప్ అనేక వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఇండస్ట్రియల్ పెయింటింగ్, డ్రేడ్జింగ్, స్టెవే బోరింగ్, లాజిస్టిక్ సొల్యూషన్స్, షిప్పింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఆటోమొబైల్, ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్, స్పెషాలిటీ కోటింగ్ వంటి వ్యాపారాధన కొనసాగిస్తుంది. అయితే మెహ్లీ వ్యాపారపరమైన సవాళ్ళను ఎదుర్కోవడంలో దిట్ట అని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంటుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Who succeeded ratan tata and the challenges for the 165 billion diversified group
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com