Ratan Tata Shanthanu: 84ఏళ్ల టాటాకు 28 ఏళ్ల శాంతను అంటే ఎందుకంత ఇష్టం? అసలు ఎవరీ శాంతను?

Ratan Tata Shanthanu: భారతీయ ప్రముఖ వ్యాపారవేత్తలో రతన్ టాటా ఒకరు. ఆయన ఇటీవల 84వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈసారి జరిగిన పుట్టిన రోజు వేడుకలు ఆయనకు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తన స్నేహితుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా రతన్ టాటా స్నేహితుడు ఎవరంటే ఏ ప్రముఖ వ్యాపార వేత్తనో.. లేదా ఐటీ దిగ్గజమో అనుకుంటారు. కానీ ఆయన స్నేహితుడు 28 ఏళ్ల కుర్రాడు. ఆ కుర్రాడి పేరు శాంతను నాయుడు. ఈయన […]

Written By: NARESH, Updated On : August 19, 2022 4:51 pm
Follow us on

Ratan Tata Shanthanu: భారతీయ ప్రముఖ వ్యాపారవేత్తలో రతన్ టాటా ఒకరు. ఆయన ఇటీవల 84వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈసారి జరిగిన పుట్టిన రోజు వేడుకలు ఆయనకు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తన స్నేహితుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా రతన్ టాటా స్నేహితుడు ఎవరంటే ఏ ప్రముఖ వ్యాపార వేత్తనో.. లేదా ఐటీ దిగ్గజమో అనుకుంటారు. కానీ ఆయన స్నేహితుడు 28 ఏళ్ల కుర్రాడు. ఆ కుర్రాడి పేరు శాంతను నాయుడు. ఈయన రతన్ టాటా భుజం మీద చేయి వేసి మరీ ఫొటో దిగాడు. ఇలాంటి కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే చాలా మంది ఈ కుర్రాడు ఎవరు..? రతన్ టాటాను చూసేందుకు అపాయింట్మెంట్ కావాలి.. అలాంటిది ఆయన భుజంపై చేయి ఎందుకు వేయాల్సి వచ్చింది..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

శాంతను నాయుడు.. టాటా సంస్థల్లోని ఓ ఉద్యోగి. 2014లో ముంబైలోని టాటా ఎల్క్సీలో ఆటో మొబైల్ డిజైన్ ఇంజనీర్ గా చేరాడు. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో ఓ శునకం మరణించడం శాంతానును బాధేసింది. ఆ ప్రదేశమంతా రక్తంతో నిండడంతో ఆయన మనసు కలిచివేసింది. దీంతో మరోసారి వీధి కుక్కను ఇలాంటి భయంకరంగా చూడొద్దని అనుకున్నాడు. దీంతో వీధుల్లో తిరిగే శునకాలను ప్రమాదాల నుంచి తప్పించాలని ఓ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి గ్లో-ఇన్-ది-డార్క్ కాలర్స్ అని పిలిచే డాగ్ కాలర్ ను సృష్టించాడు. అంటే వీధి కుక్కల మెడలకు రాత్రి పూట మెరిసే కాలర్లను వేయడమన్నమాట. ఇది కుక్కల మెడకు ఉండడంతో డ్రైవర్లకు సుదూరంగా ఉన్న గుర్తించడానికి వీలవుతుంది.

అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన దగ్గర డబ్బు లేదు. దీంతో శాంతాను తన దగ్గర డబ్బు లేకపోవడంతో గ్లో-ఇన్-ది-డార్క్ కాలర్స్ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నానని రతన్ టాటాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖను అందుకున్న టాటా వెంటనే స్పందించారు. కొన్ని రోజుల తరువాత అతన్ని ఓ సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. శాంతన్ లేఖ తనను తీవ్రంగా కలిచి వేసిందని ఈ సందర్భంగా రతన్ టాటా పేర్కొన్నారు. దీంతో గ్లో-ఇన్-ది-డార్క్ కాలర్స్ కార్యక్రమం కొనసాగించేందుకు నిధులు సమకూర్చారు. అలా శాంతాను, టాటా మధ్య స్నేహం కుదిరింది.

కానీ ఇంతలో శాంతాను యూఎస్ లో గ్రాడ్యూయేట్ కొనసాగించడానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే రతన్ టాటా చదివిన కార్నెల్ యూనివర్సిటీలోనే శాంతాను కూడా చదవడం విశేషం. కొన్ని రోజుల పాటు తనతో కలిసి ఉండి అమెరికా వెళ్లేందుకు పయనమైన శాంతాను చూసి రతన్ తీవ్రంగా బాధపడ్డాడు. కానీ తాను చదివిన యూనివర్సిటీలోనే చదువు కొనసాగిస్తున్నాడని తెలిసిన తరువాత గర్వంగా ఫీలయ్యారు. కొన్ని రోజుల పాటు యూఎస్ లో చదువు కొనసాగించిన శాంతాను నాయుడు తిరిగి భారతదేశానికి వచ్చాడు.

ఈ నేపథ్యంలో శాంతాను మళ్లీ తన సంస్థలో పనిచేయాని రతన్ టాటా కోరాడు. అంత పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు స్వయంగా తమ సంస్థలో పనిచేయడానికి ఆహ్వానించడం నిజంగా గర్వించదగ్గ విషయమని శాంతాను వెంటనే ఒప్పుకున్నాడు. ఇలా శాంతాను చేసిన పనికి రతన్ టాటా మెచ్చి అతన్ని శాశ్వతంగా తమ సంస్థలో.. అలాగే తనకు సహాయకుడిగా ఉండాలని కోరాడు. ఇప్పుడు శాంతాను నాయుడు జీవితాంతం టాటాతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు.