Electric Scooters: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ రకరకాల హామీలను ఇచ్చింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించి వాటిని అమలు చేస్తానని తెలిపింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు కొన్ని ప్రత్యేక పథకాలను ప్రకటించింది. వీటిల్లో ఉచిత బస్సు, రూ 500 కే గ్యాస్.. 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు రూ.2500 ఇస్తానని పేర్కొంది. వీటితోపాటు యువతులకు మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తానని హామీ ఇచ్చింది. అయితే ఈ హామీపై నిన్నటి వరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇటీవల కొందరు యువతులు మా స్కూటర్లు ఎక్కడ..? అంటూ ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఏర్పాటు చేసిన పథకాల్లో ఉచిత బస్సు ముందుగా ప్రారంభించారు. ఆ తర్వాత 500 కే గ్యాస్ ను అందిస్తున్నారు. అయితే మహిళలకు నిరుద్యోగ భృతి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ యువతులు మహిళలకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడా..? అంటూ కొందరు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఓయూలో జరిగిన ఆంధ్ర మహిళ సభలో కొందరు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులు మా స్కూటర్లు ఎక్కడ అంటూ యువతులు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారు. అంతేకాకుండా తమకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలని విద్యార్థినిలు పోస్ట్ కార్డులు రాసి ప్రియాంక గాంధీకి పంపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డారు.
మిగతా హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా ఇవ్వడం పై ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వారు అన్నారు. అంతేకాకుండా ప్రియాంక గాంధీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలంటూ వారు పోస్ట్ కార్డులు రాసి ఆమెకు పంపించడం పై చర్చనీయాంశంగా మారుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ హామీ మాత్రమే కాకుండా యువతులు మహిళలకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో చొరవ తీసుకోవాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే యువతులు చేసినా డిమాండ్పై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై దృష్టి పెడితే మహిళలు ఉచితంగా విద్యుత్ స్కూటర్లను పొందే అవకాశం ఉంది.
అయితే ఈ హామీల విషయంలో ఎలాంటి నిబంధనలు వేధిస్తారు అని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు ఉన్న స్కీం ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతులకు ఈ స్కూటర్లను అందించనున్నారు. అయితే ముందుగా వీటిని కళాశాలలో చదివే వారికి అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వాహనాలలో కేంద్రం సబ్సిడీ పోను మిగిలిన రూ 50 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలా ఒక్కో విద్యార్థిపై రూ .50 వేలు ఖర్చు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.